అన్నమయ్య జిల్లా, చిట్వేల్ మండలం, తిమ్మాయపాలెం క్రాస్ రోడ్డు వద్ద కొలువై ఉన్న నారాయణ తపోవన ఆశ్రమం నందు గీతా జయంతి వేడుకలు (డిసెంబర్ 1) న అత్యంత భక్తి వాతావరణంలో, కనుల పండుగగా జరిగాయి.
ఆశ్రమానికి చెందిన పెద్దలు, దాదాపు 50 మందికి పైగా బాలలకు భగవద్గీత సారాంశాన్ని, దాని గొప్పదనాన్ని వివరించారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన పవిత్ర శ్లోకాలను వారికి తెలియజేయడం జరిగింది. చిట్వేలి మండలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన ఈ ఆశ్రమం నిత్యం భక్తి కార్యక్రమాలకు, ఆకలితో ఉన్నవారికి అన్నదానానికి నిలయంగా నిలుస్తోంది.
గీతా పారాయణం కార్యక్రమం పూర్తయిన అనంతరం, ఆలయ ధర్మకర్తలు మధ్యాహ్నం పాల్గొన్న భక్తులందరికీ భోజన వసతిని కల్పించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, బాలలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వేడుకల గురించి ఆలయ పీఠాధిపతి నాగేశ్వరమ్మ మరియు చంద్రశేఖర్ మీడియాకు తెలియజేశారు.

నారాయణ తపోవన ఆశ్రమంలో గీతా జయంతి దివ్య వైభవం
అన్నమయ్య జిల్లా, చిట్వేల్ మండలం, తిమ్మాయపాలెం క్రాస్ రోడ్డు వద్ద కొలువై ఉన్న నారాయణ తపోవన ఆశ్రమం నందు గీతా జయంతి వేడుకలు (డిసెంబర్ 1) న అత్యంత భక్తి వాతావరణంలో, కనుల పండుగగా జరిగాయి. ఆశ్రమానికి చెందిన పెద్దలు, దాదాపు 50 మందికి పైగా బాలలకు భగవద్గీత సారాంశాన్ని, దాని గొప్పదనాన్ని వివరించారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన పవిత్ర శ్లోకాలను వారికి తెలియజేయడం జరిగింది. చిట్వేలి మండలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన ఈ ఆశ్రమం నిత్యం భక్తి కార్యక్రమాలకు, ఆకలితో ఉన్నవారికి అన్నదానానికి నిలయంగా నిలుస్తోంది. గీతా పారాయణం కార్యక్రమం పూర్తయిన అనంతరం, ఆలయ ధర్మకర్తలు మధ్యాహ్నం పాల్గొన్న భక్తులందరికీ భోజన వసతిని కల్పించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, బాలలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకల గురించి ఆలయ పీఠాధిపతి నాగేశ్వరమ్మ మరియు చంద్రశేఖర్ మీడియాకు తెలియజేశారు.

