*అమరావతి (విశాఖ పున్నమి ప్రతినిధి):-*
దిత్వా తుపానుపై సచివాలయంలో ఆర్టీజీఎస్ స్టేట్ సెంటర్ నుంచి హోంమంత్రి అనిత సమీక్ష.
నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు,అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్.
పాల్గొన్న ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటమనేని భాస్కర్, సీఈఓ ప్రఖర్ జైన్, ఉన్నతాధికారులు.
ఈరోజు, రేపు అధికారులు మరింత అలెర్ట్ గా ఉండాలి.
క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి.
ప్రాణనష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది.
సహాయం కోసం కంట్రోల్ రూమ్ కు వచ్చే కాల్స్ కు వెంటనే స్పందించాలి.
ప్రమాద స్పాట్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులను నియమించాలని ఆదేశం.
జన జీవనానికి అడ్డంకులు కలిగించే విరిగిన కొమ్మలు, హార్డింగ్స్ వంటివి వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలి.
విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరణ చేయాలి : హోంమంత్రి అనిత
అన్ని ముందస్తూ చర్యలు తీసుకున్నామని తెలిపిన కలెక్టర్లు.
అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపిన కలెక్టర్లు.


