Monday, 8 December 2025
  • Home  
  • ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా ‘సర్గమ్ 2025’
- విశాఖపట్నం

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా ‘సర్గమ్ 2025’

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా ‘సర్గమ్ 2025’ – నేవీ డే సన్నాహక కార్యక్రమాల్లో అలరించిన నేవీ బ్యాండ్ విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- డిసెంబర్ 4వ తేదీన జరగబోయే నేవీ డే ఉత్సవాలకు ముందస్తుగా తూర్పు ప్రాంత నావికాదళ కమాండ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన సర్గం 2025 – ఇండియన్ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శనివారం సాయంత్రం సముద్రిక ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం విమానాశ్రయంలో నేవల్ ఆఫీసర్లు శ్రీ రజనీష్ శర్మ, శ్రీ కిషోర్, శాసన సభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ వంశీ కృష్ణ యాదవ్, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పంచకర్ల రమేష్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఈస్టర్న్ నావల్ కమాండ్ లోని శౌర్య అతిథి గృహం చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రివర్యులతో విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీ శంఖబ్రత బాగ్చి సమావేశమయ్యారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు సముద్రిక చేరుకున్నారు. చీఫ్ అడ్మిరల్ శ్రీ సంజయ్ భల్లా, ఆయన సతీమణి శ్రీ ప్రియా భల్లా స్వాగతం పలికారు. *అలరించిన నేవీ బ్యాండ్* సర్గం 2025లో భాగంగా తూర్పు ప్రాంత నావికాదళ సింఫనీక్ బ్యాండ్ లయబద్దంగా చేసిన సంగీత విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ కంపోజర్, ఈస్ట్రన్ నావెల్ కమాండ్ బ్యాండ్ డైరెక్టర్ శ్రీ సతీష్ ఛాంపియన్, ఈస్ట్రన్ నావెల్ బ్యాండ్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్ లు లయబద్ధంగా సంగీతానికి దర్శకత్వం వహించగా, దేశభక్తి గీతాలు, హిందీ పాటలతో పాటు ఎన్విరాన్మెంట్ సంబంధిత అంశాలపై కూడా ఈస్ట్రన్ నేవీ బ్యాండ్ చేసిన సంగీతం అందరిని ఆకట్టుకుంది. సుమారు గంటకు పైగా చేసిన ఈ సంగీత విన్యాసాలు అందరిని సమ్మోహితం చేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లయన్ కింగ్ మ్యూజిక్ మెమొంటోను శ్రీ శరత్ కుమార్ సింగ్ బాబుకి అందజేశారు. తూర్పు ప్రాంత నావికాదళ కమాండ్ వైస్ అడ్మిరల్ శ్రీ సంజయ్ భల్లా చేతుల మీదుగా ముఖ్యఅతిథి శ్రీ పవన్ కళ్యాణ్ గారు టోకెన్ ఆఫ్ రెమెంబెన్స్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు శ్రీ అకీరా నందన్ పాల్గొన్నారు.

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా ‘సర్గమ్ 2025’

– నేవీ డే సన్నాహక కార్యక్రమాల్లో అలరించిన నేవీ బ్యాండ్
విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-
డిసెంబర్ 4వ తేదీన జరగబోయే నేవీ డే ఉత్సవాలకు ముందస్తుగా తూర్పు ప్రాంత నావికాదళ కమాండ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన సర్గం 2025 – ఇండియన్ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శనివారం సాయంత్రం సముద్రిక ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం విమానాశ్రయంలో నేవల్ ఆఫీసర్లు శ్రీ రజనీష్ శర్మ, శ్రీ కిషోర్, శాసన సభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ వంశీ కృష్ణ యాదవ్, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పంచకర్ల రమేష్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఈస్టర్న్ నావల్ కమాండ్ లోని శౌర్య అతిథి గృహం చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రివర్యులతో విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీ శంఖబ్రత బాగ్చి సమావేశమయ్యారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు సముద్రిక చేరుకున్నారు. చీఫ్ అడ్మిరల్ శ్రీ సంజయ్ భల్లా, ఆయన సతీమణి శ్రీ ప్రియా భల్లా స్వాగతం పలికారు.
*అలరించిన నేవీ బ్యాండ్*
సర్గం 2025లో భాగంగా తూర్పు ప్రాంత నావికాదళ సింఫనీక్ బ్యాండ్ లయబద్దంగా చేసిన సంగీత విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ కంపోజర్, ఈస్ట్రన్ నావెల్ కమాండ్ బ్యాండ్ డైరెక్టర్ శ్రీ సతీష్ ఛాంపియన్, ఈస్ట్రన్ నావెల్ బ్యాండ్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్ లు లయబద్ధంగా సంగీతానికి దర్శకత్వం వహించగా, దేశభక్తి గీతాలు, హిందీ పాటలతో పాటు ఎన్విరాన్మెంట్ సంబంధిత అంశాలపై కూడా ఈస్ట్రన్ నేవీ బ్యాండ్ చేసిన సంగీతం అందరిని ఆకట్టుకుంది. సుమారు గంటకు పైగా చేసిన ఈ సంగీత విన్యాసాలు అందరిని సమ్మోహితం చేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లయన్ కింగ్ మ్యూజిక్ మెమొంటోను శ్రీ శరత్ కుమార్ సింగ్ బాబుకి అందజేశారు. తూర్పు ప్రాంత నావికాదళ కమాండ్ వైస్ అడ్మిరల్ శ్రీ సంజయ్ భల్లా చేతుల మీదుగా ముఖ్యఅతిథి శ్రీ పవన్ కళ్యాణ్ గారు టోకెన్ ఆఫ్ రెమెంబెన్స్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు శ్రీ అకీరా నందన్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.