*ఐదవ వార్డు లో యూజిడి సమస్యకు పరిష్కారం*
*సుమారు రూ.3 కోట్ల నిధులతో రాజీవ్ గృహకల్ప, వైయస్సార్ కాలనీలలో యూజీడి పనులకు శ్రీకారం.*
*_5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత_*
*మధురవాడ* విశాఖ పున్నమి ప్రతినిధి: జీవీఎంసీ ఐదవ వార్డ్ పరిధిలోగల రాజీవ్ గృహకల్ప, వైయస్సార్ కాలనీలలో యూజీడి సమస్య శాశ్వత పరిష్కారానికై సుమారు మూడు కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని ఐదవ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మొల్లి హేమలత అన్నారు. అందులో భాగంగా ఈరోజు ఆ పనులకు కార్పొరేటర్ హేమలత భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ వార్డు లో యూజీడి సమస్య చాలా ఎక్కువగా ఉందని, దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు ఆ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ యుజిడి సమస్యను పరిష్కరించాలని చాలా సార్లు జివిఎంసి కౌన్సిల్ సమావేశాలలో మాట్లాడడం జరిగిందని,గత ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో చాలా అలసత్వంగ ఉండడం వలన అప్పుడు ఈ సమస్య పరిష్కారం కాలేదని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ సమస్యపై జీవీఎంసీ కౌన్సిల్ ద్వారా మేయర్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లానని అలాగే స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు సహకారంతో ఈరోజు వార్డులో యూజిడి సమస్య పరిష్కారానికై సుమారు 6 కోట్ల నిధులు మంజూరయ్యాయని, అందులో భాగంగా మొదట విడతగా రాజీవ్ గృహకల్ప, వైయస్సార్ కాలనీలో సుమారు మూడు కోట్ల నిధులతో పనులు ప్రారంభించమని, మిగిలిన పనులు కూడా తొందరగానే ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,వాండ్రాశి అప్పలరాజు, ఈగల రవికుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, కొండపూ రాజు, వంకా నూకరాజు, శ్రావణ్, చక్రీ,నాగేశ్వరరావు, రామునాయుడు,రమేష్, ఇమందిరాజు ,ప్రమీలదేవి,కృష్ణవేణి, మాధవ,రాంబాబు, రవీంద్ర,మోహన్, హరికృష్ణ,లక్ష్మీనారాయణ, అప్పారావు, వాయుకుమార్ సచివాలయ కార్యదర్శులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


