తూర్పుగోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083.
సిపాయిల తిరుగుబాటు నాయకురాలు ఝాన్సీ లక్ష్మీబాయి 197వ జయంతి వేడుకలు ఏజెన్సీ టైగర్ కీర్తిశేషులు ముత్యాల ముత్యాల రాయుడు మిత్రమండలి,మేడా మహా మిత్రమండలి మరియు ముత్యాల రాయుడు మిత్రమండలి వాట్సాప్ గ్రూపుల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రాత్రి రాజమహేంద్రవరం ఆర్యాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయవాది సుంకర వెంకట భాస్కర రంగారావు అధ్యక్షత వహించగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ విశిష్ట అతిథిగాను,ప్రముఖ చరిత్రకారులు,రాజమహేంద్రవరం ఎస్. కే.వి.టి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ పాలపర్తి ఎబెల్ రాజబాబు ముఖ్యఅతిథిగాను విచ్చేశారు.
న్యాయవాది పలివెల వీర్రాజు,వ్యాపారవేత్తలు కోటిపల్లి కేశవ, హుస్సేన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువ న్యాయవాది మరియు ముత్యాల రాయుడు మిత్రమండలి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పేడూరి అంబేద్కర్ తొలుత స్వాగతం పలకగా న్యాయవాది నామన సీతారాం చివరిగా వందన సమర్పణ చేసినట్లు ఏజెన్సీ టైగర్ కీర్తిశేషులు ముత్యాల ముత్యాల రాయుడు మిత్రమండలి ప్రజా సంబంధాల అధికారి ఆనాపు లక్ష్మీనారాయణ అలియాస్ బాబి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయవాది మేడా శ్రీనివాస్ సౌజన్యంతో నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా మేడా శ్రీనివాస్ ను డాక్టర్ రాజబాబు చేతులు మీదుగా ఘనంగా సత్కరించినట్లు బాబి తెలిపారు.
END

