వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమo
రైల్వే కోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
ఓబులవారిపల్లి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఓబులవారిపల్లె మండలం వై కోట పంచాయతి నందు జరిగినది. ,మాజీ జెడ్పిటిసి మాజీ టూరిజం డైరెక్టర్ వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తుచేశారు,గత జగనన్న ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయి అని ,ఈ ప్రభుత్వం పేదలు అంటే చులకన గా చూస్తుంది అని, నెలల తరబడి ఆఫీస్ లు చుట్టూ తిరుగుతున్నా కూడా పనులు కావటం లేదు అని గుర్తు చేశారు,ఆంధ్రప్రదేశ్ రాష్టం కలిసి ఉన్నపుడు మెడికల్ కాలేజీలు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో వచ్చాయని, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు వైద్యం అందాలని, ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో ఎక్కువ అయ్యాయని, వాటిలో పేదలు ఖర్చు భరించలేరని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి 17 మెడికల్ కళాశాలలో మంజూరు చేయించారని, ఐదు మెడికల్ కళాశాలను పూర్తి చేయగా, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ప్రవేట్ పరం చేయాలి అని చూస్తున్నారు కాబట్టి మనం అందరం కలిసి కట్టిగా పోరాడాలి అని గుర్తుచేశారు దానిలో భాగంగా కోటి సంతకాలు చేసి గవర్నర్ కి సమర్పించాలి అని తెలియచేసారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ మల్లెం ఈశ్వరయ్య,కో ఆప్షన్ నంబర్ మౌల,చింతకుంట గురవయ్య, గడ్డం రఘురామయ్య ,గడ్డం వెంకటేష్ ,మల్లెం దేశయ ,మారే సుకుమార్,మాచినేని శంకర ,సూరాల చంద్రశేఖర్,తదితరులు పాల్గొన్నారు.


