నందిగామ పరిసరాల్లో ప్రత్తి పండించే రైతులకు శుభవార్త. ఇకపై గుంటూరు వరకూ వెళ్లకుండా స్థానికంగానే ప్రత్తిని విక్రయించుకునే అవకాశం లభించింది. నందిగామ మార్కెట్‌యార్డు వద్ద ఇటీవల సీసీఐ ప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రైతుల సమస్యలను గుర్తించిన స్థానిక శాసనసభ్యు రాలు తంగిరాల సౌమ్య ముందుకు వచ్చి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి, సమీపంలోని తిరుమలగిరి సాంబశివ కాటన్ మిల్ వద్దనే ప్రత్తి కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయించారు.
ఏ ఎమ్ సి వైస్ చైర్మన్ అమ్మినేని జ్వాలా ప్రసాద్ మాట్లాడుతూ— మంగళవారం నుంచి రైతులు ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకుని తిరుమలగిరిలోనే తమ ప్రత్తిని సులభంగా విక్రయించుకోవచ్చని తెలిపారు.
స్థానికంగా ఈ సౌకర్యం లభించ డంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రవాణా ఖర్చులు, సమయ నష్టం, గిరాకీసమస్యలు తగ్గిపోవడంతో రైతులకు నిజమైన ఉపశమనం లభించనుందని చెప్పారు. ఈ ఏర్పాట్లకు కృషి చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు ఎడి, సెక్రటరీలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం రానున్న ప్రత్తి సీజన్‌లో ప్రాంతంలోని వేలాది మంది రైతులకు మేలు చేయనుందని వ్యవసాయ వర్గాలు అభినందిస్తున్నాయి.

తిరుమలగిరిలోనే ప్రత్తి కొనుగోలు ప్రారంభం రైతులకు పెద్ద ఉపశమనం… MLA తంగిరాల సౌమ్య ప్రత్యేక చొరవ
నందిగామ పరిసరాల్లో ప్రత్తి పండించే రైతులకు శుభవార్త. ఇకపై గుంటూరు వరకూ వెళ్లకుండా స్థానికంగానే ప్రత్తిని విక్రయించుకునే అవకాశం లభించింది. నందిగామ మార్కెట్‌యార్డు వద్ద ఇటీవల సీసీఐ ప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రైతుల సమస్యలను గుర్తించిన స్థానిక శాసనసభ్యు రాలు తంగిరాల సౌమ్య ముందుకు వచ్చి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి, సమీపంలోని తిరుమలగిరి సాంబశివ కాటన్ మిల్ వద్దనే ప్రత్తి కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయించారు. ఏ ఎమ్ సి వైస్ చైర్మన్ అమ్మినేని జ్వాలా ప్రసాద్ మాట్లాడుతూ— మంగళవారం నుంచి రైతులు ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకుని తిరుమలగిరిలోనే తమ ప్రత్తిని సులభంగా విక్రయించుకోవచ్చని తెలిపారు. స్థానికంగా ఈ సౌకర్యం లభించ డంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రవాణా ఖర్చులు, సమయ నష్టం, గిరాకీసమస్యలు తగ్గిపోవడంతో రైతులకు నిజమైన ఉపశమనం లభించనుందని చెప్పారు. ఈ ఏర్పాట్లకు కృషి చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు ఎడి, సెక్రటరీలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం రానున్న ప్రత్తి సీజన్‌లో ప్రాంతంలోని వేలాది మంది రైతులకు మేలు చేయనుందని వ్యవసాయ వర్గాలు అభినందిస్తున్నాయి.

