*మోదీ నాయకత్వంపై ప్రజల్లో పెరిగిన విశ్వాసo*
*బీహార్ లో భాజపా ఘన విజయo… గాజువాకలో శ్రేణుల సంబరాలు*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెండు వందల పై చిలుకు స్థానాలను కైవసం చేసుకున్న నేపథ్యంలో గాజువాక పాత కర్నవానిపాలెం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.భాజపా రాష్ట్ర మీడియా పేనలిస్ట్ మరియు గాజువాక ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి,బాణాసంచా కాల్చారు.అనంతరం కేక్ ను కట్ చేశారు.ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో అక్కడి ప్రజలు మోదీ నాయకత్వాన్ని నమ్మి పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించారని అన్నారు.ఇటీవల జరుగుతున్న ఎన్నికలన్నింటిలో భాజపా జెండా రెపరెపలాడుతోందని దీంతో ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని అన్నారు.దేశంలో మోదీ ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది అన్నారు.జమ్ము కశ్మీర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడి బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా కూడా ఘన విజయాన్ని అందుకున్నారని పేర్కొంటూ భాజపా తరపున గెలుపొందిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు సిరసపల్లి నూకరాజు,గూటూరు శంకరరావు,బాటా శ్రీనివాస్,బొండా ఎల్లాజీ,అశోక్,నాగేశ్వరరావు,రోహిణి,పద్మ,భువనేశ్వరి ,అప్పలరాజు,నాగరాజు,కృష్ణారెడ్డి, మనోహర్,రమాదేవి,సత్యనారాయణ , జగదీష్,నారాయణ తదితరులు పాల్గొన్నారు.


