మెడికల్ కళాశాల వ్యవహారంపై వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయ నాటకాలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయని జనసేన నాయకుడు కొట్టె బద్రి వ్యాఖ్యానించారు. సంతకాల సేకరణ పేరుతో పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
విద్యా సంస్థల ప్రైవేటీకరణకు జీవోలు తెచ్చిన వైసీపీ
*“ఇప్పుడేమో పీపీపీ విధానంపై మొసలి కన్నీరు కారుస్తున్న వైసీపీ నేతలు, తమ ప్రభుత్వం లో విద్యా సంస్థల ప్రైవేటీకరణ కు జీవో నంబర్లు 42, 50 తీసుకువచ్చిన విషయం ప్రజలు మరచిపోలేదు’’* అని బద్రి అన్నారు.నందిగామ కేవీఆర్ కాలేజీని ప్రైవేట్ పరంగా మార్చడానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేసినప్పుడు 31మంది విద్యార్థులను పోలీసులు ఈడ్చుకుపోయిన ఘటన అందరికీ గుర్తుందన్నారు.
ఆ సమయంలో మొండితోక జగన్మోహన్‌రావు ఆదేశాల మేరకు విద్యార్థులను చందర్లపాడు, కంచికచర్ల పోలీస్ స్టేషన్లకు తరలించి అరెస్ట్ చేయించారని ఆయన పేర్కొన్నారు.
*డ్రామాలతో దృష్టి మళ్లింపు*
*“కల్తీ లడ్డు, కల్తీ లిక్కర్ వ్యవహారాలను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ నేతలు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు’’* అని బద్రి ఎద్దేవా చేశారు.ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి వస్తున్నపెట్టుబడులు, సంక్షేమ పథకాలు చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. *“వైద్య కళాశాలలు పూర్తయ్యాక 1,500 సీట్లు లభిస్తాయి. అందులో 725 సీట్లు ఉచితం. ఇది ప్రజలకు మేలు చేసే నిర్ణయం’’* అని బద్రి వివరించారు.రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిసత్యకుమార్ ఇప్పటికే స్పష్టతనిచ్చినప్పటికీ వైసీపీ నేతలు ప్రజల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.
*“చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో మాట్లాడండి’’*
*“వైసీపీ నేతలకు నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వెళ్లి మాట్లాడండి. ప్రజా రోడ్లను ఆక్రమించి సంతకాల సేకరణ పేరుతో ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించడం తగదు’’* అని బద్రి సూచించారు.
*ఫొటో క్యాప్షన్* :
గతంలో నందిగామ KVR కాలేజీ విద్యార్థులను అరెస్ట్ చేసి కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కి తరలించిన దృశ్యం.


