రాజమహేంద్రవరం, నవంబర్ 06 :
న్యాయవాదుల రక్షణకై ప్రత్యేక రక్షణా చట్టం తక్షణమే అమలు చేయాలని “ఆలా” అధ్యక్షులు, సీనియర్ హై కోర్టు న్యాయవాది ఎమ్ వి రాజారామ్ స్ఫూర్తితో డోన్ ప్రాంతం నుండి నాయవాదులు లక్ష్మి శెట్టి కృష్ణ ప్రసాద్ , కె. ఈశ్వరయ్య లు యాత్ర ప్రారంభించారు . ఈ యాత్ర అంకుటిటత దీక్షతో గుంటూరు జిల్లాలో గల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయం వద్దకు చేరుకొని ముగుస్తుంది. ఈ పాదయాత్ర కు అనేక అవాంతరాలు ఎదురై నప్పటికి “ఆలా” అధ్యక్షులు ఎమ్ వి రాజారామ్ కృషితో న్యాయస్థానం ద్వారా అనుమతి సాధించారు .
న్యాయవాదులు అనేక సమస్యలతో సత మత మవుతున్నారనే యదార్థన్ని గమనించిన లక్ష్మిశెట్టి కృష్ణ ప్రసాద్, కె. ఈశ్వరయ్య లు న్యాయవాదుల భద్రత కోసం పాదయాత్ర చేసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటానికి సిద్దపడి ఎన్ని ప్రయాసలనైనా తట్టుకుని పాదయాత్ర చేయటానికి ముందుకు సాగుతున్నారు. ఈ పాదయాత్ర కు సంఘీబావంగా అనేక ప్రాంతాల నుండి కృష్ణ ప్రసాద్ , ఈశ్వరయ్య లకు మద్దతు తెలుపుతున్నారు .
న్యాయవాదుల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఆవిర్బవించిన ” ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ” ఖచ్చితంగా న్యాయవాదులకు అవసరమయ్యే ప్రత్యేక భద్రతా చట్టం , ప్రైవేట్,కార్పొరేట్, ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత ఆరోగ్య సేవలు సాధిస్తామని, ఆలా వ్యూహ రచనతో ముందు ముందు అద్భుతమైన మంచి రోజులు న్యాయవాదులకు వున్నాయని , పూర్తి స్థాయి భద్రత, సంక్షేమం , ఇతర మెరుగైన సౌకర్యాలు ఖచ్చితంగా సాధిస్తామని ఎమ్ వి రాజారామ్ , మేడా శ్రీనివాస్ లు ధీమా వ్యక్త పరిచారు .
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వున్నటు వంటి “ఆలా” సభ్యులు కృష్ణ ప్రసాద్ , ఈశ్వరయ్య లు చేస్తున్న పాదయాత్రకు అండగా నిలిచి వారి పాదయాత్రను విజయవంతం చేయాలని, ఆలా గ్రూపు సభ్యులు అందరు తోటి సహచర న్యాయవాదులకు పాదయాత్ర కోసం తెలియచేసి న్యాయవాదుల భద్రతకు తోడ్పడాలని ఎమ్ వి రాజారామ్ , మేడా శ్రీనివాస్ లు ఆలా సభ్యులకు పిలుపునిచ్చారు.
కృష్ణ ప్రసాద్ , ఈశ్వరయ్య ల పాదయాత్ర న్యాయవాదుల చరిత్రలో నిలిచిపోతుందని , వీరి పాదయాత్ర ను ఒక స్ఫూర్తిగా తీసుకుని తోటి న్యాయవాదులందరు మన ఐఖ్యతను తెలియచేసే విధంగా మద్దత్తు తెలపాలని , న్యాయవాదుల కోసం పాదయాత్ర ద్వారా చేస్తున్న పోరాటం మరువలేనిదని , త్వరలో న్యాయవాదుల భద్రత , సంక్షేమం , ఇతర సమస్యలపై ఒక అంతర్గత సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ సిద్దం చేస్తామని రాజారామ్ , శ్రీనివాస్ లు తెలిపారు.


