యోగులపర్వతం పై కార్తీక దీపోత్సవం
మహాదీపాన్ని వెలిగించిన శ్రీ ప్రతాప్ స్వామీజీ
రామచంద్రాపురం మండలం పున్నమి ప్రతినిధి (రోసిరెడ్డి )
ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో
పూజ్యశ్రీ ప్రతాప్ స్వామి దివ్య ఆశీస్సులతో, శివకేశువులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా పవిత్ర యోగులపర్వతం పై కార్తీక దీపోత్సవం జరిగింది. ఉదయం నుంచే యోగుల పర్వతంపై వెలిసి ఉన్న శ్రీ మహాగణపతి స్వామికి, శ్రీ బాలసుబ్రమణ్య స్వామికి, మహా శివునికి, నాగదేవతలకు, శ్రీవారి పాదాలకు సుగంధ ద్రవ్యాలతో విశేషాలు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు
దీపోత్సవానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 6 అడుగుల ఎత్తైన దివ్య దీపం (కొప్పర) 1503 కేజీల నెయ్యి మరియు 2000మీటర్లు ఒత్తు కలిగిన మహాదీపాన్ని ఓం నమశ్శివాయ నామస్మరణల పారావస్యంతో భక్తిశ్రద్ధలతో శ్రీ ప్రతాప్ స్వామీజీ వెలిగించారు. యోగుల పర్వతం శివనామ స్మరణతో మారు మ్రోగింది. పరిసర ప్రాంతాల ప్రజలే కాక ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కార్తీక దీపాన్ని సందర్శించారు. యోగుల పర్వతంపై వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం త్రాగునీరు అన్నదానం ప్రసాద వితరణ నిర్వాహకులు చేశారు. ఈ సందర్భంగా గురూజీ భక్తులకు భక్తి ప్రవచనం బోధించారు ఈ దివ్య దీపం ధర్మం, భక్తి, లోకకల్యాణం యొక్క ప్రకాశాన్ని ప్రతిబింబిస్తూ, ఆధ్యాత్మిక సందేశాన్ని వ్యాప్తి
వేలాది భక్తులు దీపాలు వెలిగించి,
ఈ పవిత్ర దీపోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని, ప్రకృతి పరిరక్షణ, లోకశాంతి, ప్రజల శ్రేయస్సు, సమాజ సౌభ్రాతృత్వం కోసం ప్రార్థనలు చేశారు.
ఆ జ్యోతి వెలుగులో యోగులపర్వతం ఆధ్యాత్మిక క్షేత్రంగా మారి, ప్రతి భక్తుడి హృదయంలో భక్తిజ్యోతి వెలిగించింది.
“దీపం ఒకటి వెలిగితే చీకటి తొలగుతుంది,
భక్తి వెలిగితే లోకం ప్రకాశిస్తుంది.
ధర్మజ్యోతి మన హృదయంలో వెలిగినపుడు,
అది యుగయుగాల వెలుగుకి మూలం అవుతుంది.”


