Monday, 8 December 2025
  • Home  
  • జిల్లా లో ఈ నెల 17 నుండి 30 వరకు కుష్టువ్యాధి గుర్తింపు సర్వే.
- విశాఖపట్నం

జిల్లా లో ఈ నెల 17 నుండి 30 వరకు కుష్టువ్యాధి గుర్తింపు సర్వే.

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- జిల్లా లో ఈ నెల 17 నుండి 30 వరకు కుష్టువ్యాధి గుర్తింపు సర్వే. శరీరంపై స్పర్శ లేని మచ్చలుంటే తెలపండి. కలెక్టర్ MN హరేందిర ప్రసాద్. జిల్లాలోని ఈ నెల 17 నుండి 30 వ తేదీ వరకు కుష్టువ్యాధిని గుర్తించే కార్యక్రమం (LCDC) పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కుష్టువ్యాధి సర్వే పై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ హారంధిర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల పరిధి లోని ఆశా కార్యకర్తలు, మగ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలన్నారు. ఎవరైనా తమ శరీరం పై స్పర్శ లేని మచ్చలు ఉన్నట్లయితే ఇంటికి వచ్చే వైద్య సిబ్బందికి తెలియ జేయాలన్నారు. ప్రాధమిక స్థాయిలోనే మచ్చలను గుర్తిస్తే అంగ వైకల్యం రాకుండా ,ఇతరులకు వ్యాపించకుండా ఉంటుందన్నారు.వసతిగృహాల్లో ఉండే పిల్లలను కూడా పరిశీలించాలన్నారు. ప్రతిరోజూ 30 నుండి 40 గృహాలను సందర్శించి వ్యాధి గ్రస్తులు ఉన్నట్లయితే గుర్తించి మందులు ఇవ్వాలన్నారు. మందులు ఉచితంగా ఇవ్వ బడతాయన్నారు. సిబ్బంది ఇంటికి వచ్చినపుడు వారికి సహకరించి తనిఖీ చేయించు కోవాలన్నారు. కుష్టు వ్యాధి నిర్మూలనకు మండల ,గ్రామ స్థాయి లో అధికారులు వైద్య సిబ్బందికి సహకరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కుష్టు, క్షయ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డా.R .రమేష్, జిల్లా పరిషత్ సి. ఇ. ఓ. నారాయణ మూర్తి, సాంఘిక సంక్షేమ ఉప సంచాలకులు రామారావు,DNMO డా. పద్మావతి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-

జిల్లా లో ఈ నెల 17 నుండి 30 వరకు కుష్టువ్యాధి గుర్తింపు సర్వే.
శరీరంపై స్పర్శ లేని మచ్చలుంటే
తెలపండి.

కలెక్టర్ MN హరేందిర ప్రసాద్.

జిల్లాలోని ఈ నెల 17 నుండి 30 వ తేదీ వరకు కుష్టువ్యాధిని గుర్తించే కార్యక్రమం (LCDC) పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కుష్టువ్యాధి సర్వే పై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో కలెక్టర్ హారంధిర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల పరిధి లోని ఆశా కార్యకర్తలు, మగ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలన్నారు. ఎవరైనా తమ శరీరం పై స్పర్శ లేని మచ్చలు ఉన్నట్లయితే ఇంటికి వచ్చే వైద్య సిబ్బందికి తెలియ జేయాలన్నారు. ప్రాధమిక స్థాయిలోనే మచ్చలను గుర్తిస్తే అంగ వైకల్యం రాకుండా ,ఇతరులకు వ్యాపించకుండా ఉంటుందన్నారు.వసతిగృహాల్లో ఉండే పిల్లలను కూడా పరిశీలించాలన్నారు. ప్రతిరోజూ 30 నుండి 40 గృహాలను సందర్శించి వ్యాధి గ్రస్తులు ఉన్నట్లయితే గుర్తించి మందులు ఇవ్వాలన్నారు. మందులు ఉచితంగా ఇవ్వ బడతాయన్నారు. సిబ్బంది ఇంటికి వచ్చినపుడు వారికి సహకరించి తనిఖీ చేయించు కోవాలన్నారు. కుష్టు వ్యాధి నిర్మూలనకు మండల ,గ్రామ స్థాయి లో అధికారులు వైద్య సిబ్బందికి సహకరించాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కుష్టు, క్షయ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డా.R .రమేష్, జిల్లా పరిషత్ సి. ఇ. ఓ. నారాయణ మూర్తి, సాంఘిక సంక్షేమ ఉప సంచాలకులు రామారావు,DNMO డా. పద్మావతి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.