Monday, 8 December 2025
  • Home  
  • రక్తమోడిన తెలుగు రాష్ట్రాలు.. 24 గంటల గడవకముందే వరుసగా 3 ప్రైవేట్ బస్సు ప్రమాదాలు*
- ఎలూరు

రక్తమోడిన తెలుగు రాష్ట్రాలు.. 24 గంటల గడవకముందే వరుసగా 3 ప్రైవేట్ బస్సు ప్రమాదాలు*

ఏలూరు జిల్లా పున్నమి ప్రతినిధి ఏలూరు జిల్లాలో భారతీ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో అయ్యపరాజ గూడెంకి చెందిన వీరంకి ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు లింగపాలెం మండలం జూబిలినగర్ దగ్గర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి ముందు ధర్మాజీగూడెంలో బైక్‌ను ఢీకొట్టింది బస్సు. బైక్‌పై వెళ్తున్న వారు వెంటపడుతారన్న ఆందోళనలో బస్సును వేగంగా నడిపాడు డ్రైవర్. దీంతో బస్సు టర్నింగ్ దగ్గర బోల్తా పడింది. శ్రీసత్యసాయి జిల్లాలో ఐషర్ వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది జబ్బర్ ట్రావెల్స్ బస్సు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద జరిగిందీ ప్రమాదం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది జబ్బర్ ట్రావెల్స్ బస్సు. నల్గొండ జిల్లా అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం దగ్గర ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ప్రమాదంలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. 45 మంది ప్రయాణికులతో కావలి నుంచి హైదరాబాదు వెళ్తోంది బస్సు. చేవెళ్లలో నిన్న ఘోర బస్సు ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే

ఏలూరు జిల్లా పున్నమి ప్రతినిధి

ఏలూరు జిల్లాలో భారతీ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో అయ్యపరాజ గూడెంకి చెందిన వీరంకి ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు లింగపాలెం మండలం జూబిలినగర్ దగ్గర ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదానికి ముందు ధర్మాజీగూడెంలో బైక్‌ను ఢీకొట్టింది బస్సు. బైక్‌పై వెళ్తున్న వారు వెంటపడుతారన్న ఆందోళనలో బస్సును వేగంగా నడిపాడు డ్రైవర్. దీంతో బస్సు టర్నింగ్ దగ్గర బోల్తా పడింది.

శ్రీసత్యసాయి జిల్లాలో ఐషర్ వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది జబ్బర్ ట్రావెల్స్ బస్సు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద జరిగిందీ ప్రమాదం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది జబ్బర్ ట్రావెల్స్ బస్సు. నల్గొండ జిల్లా అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం దగ్గర ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ప్రమాదంలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. 45 మంది ప్రయాణికులతో కావలి నుంచి హైదరాబాదు వెళ్తోంది బస్సు.

చేవెళ్లలో నిన్న ఘోర బస్సు ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.