*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*
ఉత్తర నియోజకవర్గంలోని మాధవధార వద్ద ఉన్న పి-4 స్వర్ణాంధ్ర కార్యాచరణ ప్రణాళిక కార్యాలయంలో ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు ప్రజల నుండి పి.జి.ఆర్.ఎస్. (PGRS) ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించారు. ఎమ్మెల్యే గారు ప్రజల అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు — జోనల్ కమిషనర్ శ్రీ రాము గారు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఏ.ఇలు, వాటర్ వర్క్స్ సిబ్బంది, పబ్లిక్ వర్క్స్ విభాగం ఏపిడీ శ్రీమతి పుణ్యవతి గారు, శ్రీమతి పద్మావతి గారు, శ్రీ తిరుపతి రావు గారు మరియు ఇతర అధికారులకు పంపిస్తూ, అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, బీజేపీ–టిడిపి–జనసేన కూటమి నాయకులు వరప్రసాద్, పద్మజ, రామకృష్ణ, కోఇలాడ వెంకటేష్, అప్పారావు , వేణుగోపాల్, జామి శ్రీను,బంగార్రాజు, శ్రీనివాస్, కీర్తి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా దర్బార్‌కు మంచి స్పందన లభించింది. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ —
“ప్రతి సోమవారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఈ కార్యాలయంలో అందుబాటులో ఉంటాను. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించి, రసీదు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని అన్నారు.


