ఉత్సాహంగా కృష్ణా జిల్లా స్థాయి షటిల్ బాడ్మింటన్ ఎంపికలు”
గన్నవరం:నియోజకవర్గం: నవంబర్ 1 పున్నమి ప్రతినిధి సురేష్
కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం నాడు గన్నవరం కే.వి.ఆర్ ఇండోర్ స్టేడియం లో అండర్ 17 బాల, బాలికల షటిల్ బాడ్మింటన్ ఎంపికలు ఉత్సాహం గా జరిగాయి.జిల్లా నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించి పోటీపడ్డారు. ఎంపికలకు ముందు జరిగిన కార్యక్రమం లో జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్సులు యం అరుణ, జి. రాంబాబు లు మాట్లాడుతూ సత్తా కలిగిన క్రీడాకారులను జిల్లా జట్టు కు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో గన్నవరం నియోజకవర్గ క్రీడా సమన్వయ కర్త ధనియాల నాగరాజు, సీనియర్ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు సి.హెచ్. చంద్ర శేఖర్, గన్నవరం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కే.వి.ఆర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వ్యాయామ విద్య ఉపాధ్యాయులు అశోక్,ముకుంద, గంగాధర్ కృష్ణ ప్రియ, రామారావు, వెంకటేశ్వరరావు,బాలకృష్ణ,గీత,టాన్య గిరి, శాంతి, సుజాత తది తదితరులు ఎంపికలు నిర్వహించారు.


