*యుపిఎస్సి పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు*
*జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్*
*విశాఖపట్టణం,అక్టోబర్ పున్నమి ప్రతినిధి* : జిల్లాలో నవంబర్ 2వ తేదీన జరగబోయే యుపిఎస్సి ( యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవంబర్ 2వ తేదీన జిల్లాలో నిర్వహించబోయే యుపిఎస్సి పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 3268 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. 7 సెంటర్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జనరల్ ఆటిట్యూడ్ టెస్ట్ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు, ఆయుర్వేద టెస్ట్ మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 4.00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆయా సెంటర్లకు ముందుగా చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్, మెడికల్, జీవీఎంసీ, పోలీసు శాఖలు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. ముగ్గురు రూట్ అధికారులను, 7 సెంటర్లకు ఏడుగురు తనిఖీ అధికారులను నియమించినట్లు తెలిపారు.


