*గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం*
*విశాఖపట్నంఅక్టోబర్ పున్నమి ప్రతినిధి *
విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గ్రామంలో గురువారం గెడ్డలో గల్లంతైన 13 ఏళ్ల ధనుశ్రీ మృతదేహం శుక్రవారం ఉదయం లభ్యమైంది. తండ్రితో కలిసి బట్టలు ఉతకడానికి వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు గెడ్డలో పడిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో మృతదేహం లభించింది. కుమార్తె మృతదేహం వద్ద తల్లి కన్నీరుమున్నీరైంది, ఇది చూసిన పలువురు కంటతడి పెట్టారు.


