విశాఖపట్నం, అక్టోబర్ 31:
దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 36వ వార్డులోని జామియా మసీదును సందర్శించి, పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. మసీదు నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు మసీదు పెద్దలు, యువత ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ — ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన హామీ ప్రకారం మసీదు నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. విశాలమైన ప్రాంగణంలో సుందరంగా మసీదు నిర్మాణం జరగడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మసీదు పునర్నిర్మాణంలో సహకరించిన వక్ బోర్డు అధికారులకు, మసీదు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
తాను మాటమీద నిలబడే మనిషినని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం తన బాధ్యతగా భావిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం మసీదు కమిటీ రెన్యువల్ కాపీని అందజేశారు. తరువాత గార్విషరీఫ్ కార్యక్రమంలో పాల్గొని విందు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో వక్ బోర్డు ఇన్స్పెక్టర్ అహ్మద్, మసీదు అధ్యక్షుడు అక్బర్ బాషా, పెద్దలు షరీఫ్, రహమతుల్లా, షకీల్, సలీం, స్థానిక వార్డు కార్పొరేటర్ మాసిపోగుమేరీ జాన్స్ రాజు, నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్ రెడ్డి, సీనియర్ నాయకుడు జీకే, జనసేన యువజన విభాగం నేత శివ గణేష్ తదితరులు పాల్గొన్నారు.


