తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా పథకాన్ని చట్టం చేసి అమలు చేయాలి
ఘన్పూర్ స్టే: తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇప్పగూడెం సముద్రాల అక్కపెల్లిగూడెం, తదితర గ్రామాలలో పంటలను సందర్శించడం జరిగింది. అదేవిధంగా పత్తి పంటల పరిస్థితిని కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి లింగనబోయిన కుమారస్వామి మాట్లాడుతూ —
“రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయాన అకాల వర్షాలు, మెంతా తుఫాను వలన వరి, పత్తి, మొక్కజొన్న పంటలు భారీగా నష్టపోయాయి. కాబట్టి ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలి,” అని డిమాండ్ చేశారు.
అలాగే ఆయన అన్నారు —
కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా పత్తిని తేమ శాతం కారణంగా తిరస్కరించకుండా, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం రూపాయలు 10075 మద్దతు ధరతో కొనుగోలు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరికీ ₹500 బోనస్, పత్తికి ₹475 బోనస్ ప్రకటించి వెంటనే చెల్లించాలి.
పొలంలోనే కల్లాలు లేదా నీటమునిగిన చేన్లలో పంటలు నాశనమైన రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా సర్వే చేసి ఎకరాకు ₹40,000 నష్టపరిహారం,
అలాగే పత్తి రైతులకు ఎకరాకు ₹60,000 నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది.
అలాగే సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ ప్రభుత్వాలను ఉద్దేశించి చెప్పారు —
“రైతును రాజు చేస్తున్నామని గొప్ప మాటలు చెప్పడం కాదు; ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతును ఆదుకోవడం నిజమైన చిత్తశుద్ధి. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిధులు కేటాయించి నష్టపరిహారం చెల్లించాలి. లేకపోతే తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం.”
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కమిటీ సభ్యులు మంద మొగిలి పిట్టల శ్రీను ఇప్పగూడెం రైతులు బోయిని కుమార్ కుంట రాజు తోడెన్గల మల్లయ్య. ఉప్పలయ్య అక్కపెళ్లి గూడెం రైతులు మెడిద కుమార్ కూస బుచ్చయ్య అశోక్ యార భోపాల్ వెంకటేష్ మరియు ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.
– లింగనబోయిన కుమారస్వామి
మండల కార్యదర్శి
తెలంగాణ రైతు సంఘం, ఘన్పూర్ స్టే


