పవిత్ర కార్తీక మాసం ఆరంభమైన తొలి సోమవారం సందర్భంగా, రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం పెద్దూరు గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రమైన గుండాల కోనలోని శ్రీ కర్కటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ తొలి సోమవారం పురస్కరించుకొని ఆలయంలో శివలింగాలకు విశేష అభిషేకాలు మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కార్తీక సోమవారానికి ఉన్న విశేష ప్రాధాన్యత దృష్ట్యా, ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. శివలింగాలకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యంగా, నేటి తొలి సోమవారం రోజున కందుల శివప్రసాద్ ( పండు) ధర్మపత్ని కందుల పూజిత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వారు శివలింగాలకు అభిషేకంలో పాల్గొని, తమ కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, పుష్పాలతో అలంకరణ చేసి, దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మార్మోగింది. కార్తీక మాసంలో శివాలయాలను దర్శించడం, అభిషేకాలు నిర్వహించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి, శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ కమిటీ వారు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు.

గుండాల కోనలో శోభాయమానంగా కార్తీక తొలి సోమవారం వేడుకలు ఘనంగా – శివలింగాలకు విశేష అభిషేకాలు, భక్తులతో కిటకిటలాడిన శ్రీ కర్కటేశ్వర స్వామి దేవాలయం
పవిత్ర కార్తీక మాసం ఆరంభమైన తొలి సోమవారం సందర్భంగా, రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం పెద్దూరు గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రమైన గుండాల కోనలోని శ్రీ కర్కటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ తొలి సోమవారం పురస్కరించుకొని ఆలయంలో శివలింగాలకు విశేష అభిషేకాలు మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక సోమవారానికి ఉన్న విశేష ప్రాధాన్యత దృష్ట్యా, ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. శివలింగాలకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యంగా, నేటి తొలి సోమవారం రోజున కందుల శివప్రసాద్ ( పండు) ధర్మపత్ని కందుల పూజిత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వారు శివలింగాలకు అభిషేకంలో పాల్గొని, తమ కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, పుష్పాలతో అలంకరణ చేసి, దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మార్మోగింది. కార్తీక మాసంలో శివాలయాలను దర్శించడం, అభిషేకాలు నిర్వహించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి, శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ కమిటీ వారు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు.

