విశాఖపట్నం, అక్టోబర్ 24:
రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డులో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ — “పేదవాడికి వైద్యం, విద్య దూరం చేసే ప్రైవేటీకరణ విధానం ప్రజావ్యతిరేకమైందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తుందని” అన్నారు.
ఈ సమావేశం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, 49వ వార్డు కార్పొరేటర్ అళ్ళు శంకరరావు ఆధ్వర్యంలో, బాణాల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించబడింది.
కార్యక్రమంలో నియోజకవర్గంలోని నలుమూలల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ వార్డుల కార్పొరేటర్లు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


