అమలాపురం, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి) : డా.బి. ఆర్ . అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం , విలసవిల్లి గ్రామం , బసవయ్య అగ్రహారం లో వేంచేసి యున్న శ్రీ రామ మందిరం నందు 12 వార్షిక కార్తీక మాస మహాలింగార్చన మహోత్సవాలు ఘనంగా బుధవారం ప్రారంభమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుబాష్ చే మహా గణపతి పూజ నిర్వహించి , ఈ కార్తీక మాస ఉత్సవాలకు సంకల్పంతో ప్రారంభించారు. ఉదయం మంత్రికి గ్రామ సర్పంచ్ సలాది ఊర్మిళా, సతీష్ గ్రామస్తులు, ఉత్సవ కర్త మున్నంగి రామకృష్ణ శర్మ, వేద పండితుల బృందం చే పూర్ణకుంభ స్వాగతం పలికారు. మున్నంగి రామకృష్ణ శర్మ , మంత్రి కు మహా లింగార్చన విశిష్టత తెలిపారు. ప్రతి రోజు మట్టి తో 365 శివలింగాలను తయారు చేసి మహాలింగార్చన పూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తామని ఉత్సవ కర్త తెలిపారు. అనంతరం మంత్రి సుభాష్ కు పండితులు వేదాశీర్వచనాలు, స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఇంతటి మంచి ఆద్యాత్మిక సనాతన ధర్మ కార్యక్రమాలను నిర్వహిస్తున్న మున్నంగి రామకృష్ణ శర్మ ను మంత్రి సుభాష్ అభినందించినారు.

కార్తిక మాస మహాలింగర్చన మహోత్సవం ప్రారంభం
అమలాపురం, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి) : డా.బి. ఆర్ . అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం , విలసవిల్లి గ్రామం , బసవయ్య అగ్రహారం లో వేంచేసి యున్న శ్రీ రామ మందిరం నందు 12 వార్షిక కార్తీక మాస మహాలింగార్చన మహోత్సవాలు ఘనంగా బుధవారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుబాష్ చే మహా గణపతి పూజ నిర్వహించి , ఈ కార్తీక మాస ఉత్సవాలకు సంకల్పంతో ప్రారంభించారు. ఉదయం మంత్రికి గ్రామ సర్పంచ్ సలాది ఊర్మిళా, సతీష్ గ్రామస్తులు, ఉత్సవ కర్త మున్నంగి రామకృష్ణ శర్మ, వేద పండితుల బృందం చే పూర్ణకుంభ స్వాగతం పలికారు. మున్నంగి రామకృష్ణ శర్మ , మంత్రి కు మహా లింగార్చన విశిష్టత తెలిపారు. ప్రతి రోజు మట్టి తో 365 శివలింగాలను తయారు చేసి మహాలింగార్చన పూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తామని ఉత్సవ కర్త తెలిపారు. అనంతరం మంత్రి సుభాష్ కు పండితులు వేదాశీర్వచనాలు, స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఇంతటి మంచి ఆద్యాత్మిక సనాతన ధర్మ కార్యక్రమాలను నిర్వహిస్తున్న మున్నంగి రామకృష్ణ శర్మ ను మంత్రి సుభాష్ అభినందించినారు.

