Monday, 8 December 2025
  • Home  
  • ఉచిత వైద్యం చేస్తున్న డాక్టర్ కొలిశెట్టి నరేష్ కు కృతజ్ఞతలు – వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
- ఖమ్మం

ఉచిత వైద్యం చేస్తున్న డాక్టర్ కొలిశెట్టి నరేష్ కు కృతజ్ఞతలు – వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 11 ఉచిత వైద్యం చేస్తున్న డాక్టర్ కొలిశెట్టి నరేష్ కు కృతజ్ఞతలు – వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గాయత్రి హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ నుంచి ఎంతోమంది కి ఉచిత వైద్యం అందిస్తున్న డాక్టర్ కొలిశెట్టి నరేష్ ని శనివారం వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అభినందించారు. మండల పరిధిలోని నాచారం గ్రామంలో శనివారం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గాయత్రి హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ కొలిశెట్టి నరేష్ ను కలిశారు. గత పది సంవత్సరాల నుంచి కొత్త మేడేపల్లి గ్రామంలో నివసిస్తున్న గుత్తి కోయలకు, ఏన్కూరు కాలువ కట్టమీద ఉన్న జంగాల కాలనీవాసులకు ఉచితంగా వైద్యం అందిస్తున్న డాక్టర్ కొలిశెట్టి నరేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా గాయత్రి హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ తో చదువుకోలేని నిరుపేదలకి చదువు కోసం ఆర్థిక సహాయం చేసిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి ఈ మధ్యకాలంలో రేపల్లెవాడ గ్రామానికి చెందిన విద్యార్థిని ఎంబిబిఎస్ సీటు సాధించిన సంగతి తెలిసిందే ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థికంగా చదువుకొని స్తోమత లేకపోవడంతో తన వంతు సహాయం గాయత్రీ హెల్పింగ్ హాండ్స్ ద్వారా అక్షరాల పదివేల రూపాయలను డాక్టర్ కొలిశెట్టి నరేష్ అందజేశారు. అనారోగ్యముతో బాధపడుతున్న కేసుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి కూడా పదివేల రూపాయలు సహాయం చేశారు. ఈ విషయాలు తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నరేష్ ను ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నరేష్ సతీమణి కొలిశెట్టి రాజేశ్వరి ఇటీవల కారు దిగుతుండగా కాలుజారి కింద పడిపోవడంతో కుడి కాలు ఫ్రాక్చర్ అయింది. విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గాయత్రి హాస్పిటల్ వద్ద ఆగి రాజేశ్వరిని పరామర్శించి జాగ్రత్తగా ఉండాలి ధైర్యంగాఉండాలని ధైర్యం చెప్పారు. ఎంతోమందికి సహాయం చేస్తున్నా మీ దంపతులకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అంటూ కరచాలనం చేశారు. ముఖ్యంగా కొత్త మేడిపల్లి గిరిజన గుత్తి కోయలకు ఉచితంగా పది సంవత్సరాల నుంచి వైద్యం చేయడం గ్రామీణ వైద్యుడిగా మన ఏన్కూరు మండలానికి గర్వకారణం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 11

ఉచిత వైద్యం చేస్తున్న డాక్టర్ కొలిశెట్టి నరేష్ కు కృతజ్ఞతలు
– వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

గాయత్రి హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ నుంచి ఎంతోమంది కి ఉచిత వైద్యం అందిస్తున్న డాక్టర్ కొలిశెట్టి నరేష్ ని శనివారం వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అభినందించారు. మండల పరిధిలోని నాచారం గ్రామంలో శనివారం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గాయత్రి హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ కొలిశెట్టి నరేష్ ను కలిశారు. గత పది సంవత్సరాల నుంచి కొత్త మేడేపల్లి గ్రామంలో నివసిస్తున్న గుత్తి కోయలకు, ఏన్కూరు కాలువ కట్టమీద ఉన్న జంగాల కాలనీవాసులకు ఉచితంగా వైద్యం అందిస్తున్న డాక్టర్ కొలిశెట్టి నరేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా గాయత్రి హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ తో చదువుకోలేని నిరుపేదలకి చదువు కోసం ఆర్థిక సహాయం చేసిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి ఈ మధ్యకాలంలో రేపల్లెవాడ గ్రామానికి చెందిన విద్యార్థిని ఎంబిబిఎస్ సీటు సాధించిన సంగతి తెలిసిందే ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థికంగా చదువుకొని స్తోమత లేకపోవడంతో తన వంతు సహాయం గాయత్రీ హెల్పింగ్ హాండ్స్ ద్వారా అక్షరాల పదివేల రూపాయలను డాక్టర్ కొలిశెట్టి నరేష్ అందజేశారు. అనారోగ్యముతో బాధపడుతున్న కేసుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి కూడా పదివేల రూపాయలు సహాయం చేశారు. ఈ విషయాలు తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నరేష్ ను ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నరేష్ సతీమణి కొలిశెట్టి రాజేశ్వరి ఇటీవల కారు దిగుతుండగా కాలుజారి కింద పడిపోవడంతో కుడి కాలు ఫ్రాక్చర్ అయింది. విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గాయత్రి హాస్పిటల్ వద్ద ఆగి రాజేశ్వరిని పరామర్శించి జాగ్రత్తగా ఉండాలి ధైర్యంగాఉండాలని ధైర్యం చెప్పారు. ఎంతోమందికి సహాయం చేస్తున్నా మీ దంపతులకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అంటూ కరచాలనం చేశారు. ముఖ్యంగా కొత్త మేడిపల్లి గిరిజన గుత్తి కోయలకు ఉచితంగా పది సంవత్సరాల నుంచి వైద్యం చేయడం గ్రామీణ వైద్యుడిగా మన ఏన్కూరు మండలానికి గర్వకారణం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.