అనకాపల్లి, అక్టోబర్ 3:
సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్ పై గ్రామ, మండల స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డ్ నుండి నెహ్రూ చౌక్ వరకు నిర్వహించిన జీఎస్టీ అవగాహన ట్రాక్టర్ ర్యాలీని కలెక్టర్, ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు.
వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీని 12-18% నుండి 5%కు తగ్గించడంతో రైతులకు భారీగా లాభం కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. పాలు, జున్నుపై పన్ను పూర్తిగా మినహాయించగా, వెన్న, నెయ్యి, బయో పురుగుమందులు, నీటి పారుదల పరికరాలపై 5% పన్ను మాత్రమే ఉంటుందని వివరించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు రైతుల ఆదాయం పెరగడానికి దోహదం చేస్తాయని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.




