Sunday, 7 December 2025
  • Home  
  • వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేయడానికే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ -డాక్టర్ గూడూరి శ్రీనివాస్.
- తూర్పు గోదావరి

వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేయడానికే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ -డాక్టర్ గూడూరి శ్రీనివాస్.

* ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఆపాలి * రాజమండ్రి పార్లమెంటు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు * వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్. రాజమండ్రి పార్లమెంట్ ప్రజలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కార్యాలయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు కష్టనష్టాలు కలగకుండా, సుఖ సంతోషాలతో ఎల్లవేళలా ఆ దుర్గామాత కాపాడాలని ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదని వివరించారు. మెడికల్ విద్య పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండాలని సదాశయంతో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించారని వివరించారు. సుమారు 5 మెడికల్ కాలేజీలు ఇప్పటికే పూర్తయి ఒక్కో కాలేజీ 150 సీట్లు తో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదంటూ దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన బినామీలకు పీపీపీ విధానం ద్వారా దరాతత్తం చేసేందుకే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. సంక్షేమ పథకాలు 40 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో వారు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. రాజకీయ కక్షలు లేవు అంటూనే లిక్కర్ స్కాం చేశారంటూ ఆరోపణ చేసి ఎంపీ మిధున్ రెడ్డిని ఎందుకు అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా హైవేపై, బడి గుడి ఉన్న ప్రాంతాలలో మద్యం అమ్మకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ మద్యం ఏరులై పారుతుందని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు.

* ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఆపాలి
* రాజమండ్రి పార్లమెంటు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
* వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్.

రాజమండ్రి పార్లమెంట్ ప్రజలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కార్యాలయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు కష్టనష్టాలు కలగకుండా, సుఖ సంతోషాలతో ఎల్లవేళలా ఆ దుర్గామాత కాపాడాలని ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదని వివరించారు. మెడికల్ విద్య పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండాలని సదాశయంతో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించారని వివరించారు. సుమారు 5 మెడికల్ కాలేజీలు ఇప్పటికే పూర్తయి ఒక్కో కాలేజీ 150 సీట్లు తో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదంటూ దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన బినామీలకు పీపీపీ విధానం ద్వారా దరాతత్తం చేసేందుకే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. సంక్షేమ పథకాలు 40 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో వారు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. రాజకీయ కక్షలు లేవు అంటూనే లిక్కర్ స్కాం చేశారంటూ ఆరోపణ చేసి ఎంపీ మిధున్ రెడ్డిని ఎందుకు అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా హైవేపై, బడి గుడి ఉన్న ప్రాంతాలలో మద్యం అమ్మకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ మద్యం ఏరులై పారుతుందని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.