కామారెడ్డి, 24 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, గోకుల్ తండా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసిన ట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ తెలి పారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈపథకాన్ని చేపట్టిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ, అర్హులంద రికీ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు లాగల ప్రసాద్, పోసానిపేట్ మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేం దర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


