Monday, 8 December 2025
  • Home  
  • అప్పుల ఊబి లో తెలంగాణ
- తెలంగాణ

అప్పుల ఊబి లో తెలంగాణ

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ తెలంగాణలో పెండింగ్ బకాయిలు 30 వేల కోట్లు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు 2.20 లక్షల కోట్లు* మరో 35100 కోట్ల అప్పుకు సన్నాహాలు* కొత్త సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మరిన్ని రుణాలు తప్పనిసరి* పోరుబాట పట్టిన విద్యార్థులు, ఉద్యోగులు, ఆసుపత్రులు , అంగన్వాడి కార్యకర్తలు* తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందా…? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి… రాజకీయ ఆర్థిక నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒకవైపు విద్యాసంస్థల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఫీజు బకాయిలు ₹8,300 కోట్లు పెండింగ్‌లో ఉండటం వల్ల విద్యార్థి సంఘాలు, విద్యాసంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీల బంద్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడే ప్రమాదం ఉంది. అదే సమయంలో, అంగన్వాడి కార్యకర్తలు మేనిపోస్ట్‌లో 18 వేల వేతనాలకు PF పెంపు కోసం న్యాయపరమైన డిమాండ్ నెరవేర్చకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయని ప్రవేట్ ఆసుపత్రులు స్పష్టం చేస్తున్నాయి.తెలంగాణలో 360కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తామని ప్రకటించాయి. 2025 జనవరిలో 10 రోజుల సమ్మె అనంతరం ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందని హామీ ఇచ్చినప్పటికీ, 7-8 నెలలుగా ఏవీ జరగడం లేదని అంటున్నారు. ఆసుపత్రులు తెలిపిన గణాంకాల ప్రకారం, రూ.1,400 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కాంట్రాక్టర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలతో పాటు మొత్తం సుమారు రూ.30,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఉద్యోగుల బకాయిలే రూ.10,000 కోట్లు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు రూ.1,350 కోట్లు, పెద్ద కాంట్రాక్టర్లు రూ.1,100 కోట్లు, నిలిచిన పనులు రూ.1,000 కోట్లు, పాతబస్తీ కాంట్రాక్టర్లు రూ.680 కోట్లు, జీహెచ్ఎంసీ బకాయిలు ₹1,100 కోట్లు, గ్రామ పంచాయతీలు రూ.1,300 కోట్లు, చిన్న కాంట్రాక్టర్లు రూ.1,000 కోట్లు, ఆరోగ్యశ్రీ హాస్పిటళ్లు రూ.1,590 కోట్లు, బేవరేజెస్ కంపెనీలు రూ.3,900 కోట్లు, నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు రూ.12.56 కోట్లు, ఆర్ అండ్ బీ, పీఆర్, ఎంఏయూడీ రూ.1,000 కోట్లు, మన ఊరు మన బడి రూ.369 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ8,300 కోట్లు ఉండగా, చిన్న తరహా కాంట్రాక్టర్లు తమ రుణాలపై వడ్డీలు చెల్లించలేక, కొత్త పనులు చేపట్టలేక ఇబ్బందులు పడుతున్నారు.పెండింగ్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం పైన ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఆసుపత్రుల ప్రతినిధులు నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నాయి. ప్రతి నెలా రూ.500 కోట్ల చొప్పున డబ్బులు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి హామీ ఇచ్చినప్పటికీ, అనేకమంది బాధితులు ఇప్పటికీ తమ వేతనాలు, రీయింబర్స్‌మెంట్ అందుకోలేక నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు.పెండింగ్ బకాయిల పై సమర్థవంతమైన వ్యవస్థలు లేకపోవడం, విత్తన , విద్య, ఆరోగ్య రంగాల్లో సమస్యలు పెరగడం, సామాజిక, ఆర్థిక వృద్ధికి అడ్డుగా మారుతుందనే వార్తలు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి.* తెలంగాణ ప్రభుత్వం మరో రూ.35,100 కోట్ల అప్పుకు సన్నాహాలు* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ.1,000 కోట్లు, మూసి సుందరీకరణ పేరిట రూ.4,100 కోట్లు, యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.30,000 కోట్లు అప్పు చేయనున్న రేవంత్ రెడ్డి .దీంతో 21 నెలలో రూ.2,34,500 కోట్లకు చేరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది* తెలంగాణ రాష్ట్రం అప్పుల వలయంలో చిక్కుకుంది. మరికొన్ని పథకాలు అమలు చేయాలంటే మరిన్ని అప్పులు చేయాల్సిందేనని రాజకీయ నిపుణలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులకు 6000 పెన్షన్ పెంపుతో…. అర్హులైన లబ్ధిదారులు 5,11,656 మంది ఉన్నారు. నెల రోజులకు గాను 6,000 × 5,11,656 = రూ .307 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడనుంది. హామీ నెరవేరాలంటే సంవత్సరానికి రూ.3,684 నిధులు అవసరం అవుతుంది.* *ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ పథకానికి నెలకు 550 కోట్లు అవసరం* తెలంగాణలో గ్యాస్ కనెక్షన్లు 1.1 కోట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నెలకు ఒక్కో కుటుంబానికి 1 సిలిండర్ అనుకుంటే 1.1 కోట్లు × 500 = రూ.550 కోట్లు నెలకు ఖర్చవుతుంది. *మహాలక్ష్మి పథకానికి నెలకు రూ.8,750 కోట్ల నిధులు అవసరం* తెలంగాణ రాష్ట్రంలో మహిళల అంచనా ప్రకారం సుమారు 35 లక్షల మహిళలు ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. నెలకు 8750 కోట్ల నిధులు అవసరం ఉంటుంది.మరిన్ని సంక్షేమ పథకాలు ప్రాజెక్టులు నిర్మించాలంటే మరో 4, లక్షల కోట్ల వరకు అప్పు చేయాల్సిందేనని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అప్పులు సమకూర్చేందుకు ప్రభుత్వ స్థలాలు వికయించడం, రిజిస్ట్రేషన్ స్టాంపులు పెంచడం, విద్యుత్ చార్జింగ్ పెంచడం, బస్ చార్జీలు పెంచడంతో ప్రజల పై మరింత భారం పడే అవకాశం ఉందని అంటున్నారు. ఏ పని ముందుకు సాగాలన్న అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం మరిన్ని రుణాలు సేకరించి నెరవేరుస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

పున్నమి ప్రతినిధి
హైదరాబాద్

తెలంగాణలో పెండింగ్ బకాయిలు 30 వేల కోట్లు

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు 2.20 లక్షల కోట్లు*

మరో 35100 కోట్ల అప్పుకు సన్నాహాలు*

కొత్త సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మరిన్ని రుణాలు తప్పనిసరి*

పోరుబాట పట్టిన విద్యార్థులు, ఉద్యోగులు, ఆసుపత్రులు , అంగన్వాడి కార్యకర్తలు*

తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందా…?

అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి… రాజకీయ ఆర్థిక నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒకవైపు విద్యాసంస్థల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఫీజు బకాయిలు ₹8,300 కోట్లు పెండింగ్‌లో ఉండటం వల్ల విద్యార్థి సంఘాలు, విద్యాసంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీల బంద్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడే ప్రమాదం ఉంది.

అదే సమయంలో, అంగన్వాడి కార్యకర్తలు మేనిపోస్ట్‌లో 18 వేల వేతనాలకు PF పెంపు కోసం న్యాయపరమైన డిమాండ్ నెరవేర్చకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయని ప్రవేట్ ఆసుపత్రులు స్పష్టం చేస్తున్నాయి.తెలంగాణలో 360కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తామని ప్రకటించాయి. 2025 జనవరిలో 10 రోజుల సమ్మె అనంతరం ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందని హామీ ఇచ్చినప్పటికీ, 7-8 నెలలుగా ఏవీ జరగడం లేదని అంటున్నారు. ఆసుపత్రులు తెలిపిన గణాంకాల ప్రకారం, రూ.1,400 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
కాంట్రాక్టర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలతో పాటు మొత్తం సుమారు రూ.30,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఉద్యోగుల బకాయిలే రూ.10,000 కోట్లు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు రూ.1,350 కోట్లు, పెద్ద కాంట్రాక్టర్లు రూ.1,100 కోట్లు, నిలిచిన పనులు రూ.1,000 కోట్లు, పాతబస్తీ కాంట్రాక్టర్లు రూ.680 కోట్లు, జీహెచ్ఎంసీ బకాయిలు ₹1,100 కోట్లు, గ్రామ పంచాయతీలు రూ.1,300 కోట్లు, చిన్న కాంట్రాక్టర్లు రూ.1,000 కోట్లు, ఆరోగ్యశ్రీ హాస్పిటళ్లు రూ.1,590 కోట్లు, బేవరేజెస్ కంపెనీలు రూ.3,900 కోట్లు, నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు రూ.12.56 కోట్లు, ఆర్ అండ్ బీ, పీఆర్, ఎంఏయూడీ రూ.1,000 కోట్లు, మన ఊరు మన బడి రూ.369 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ8,300 కోట్లు ఉండగా, చిన్న తరహా కాంట్రాక్టర్లు తమ రుణాలపై వడ్డీలు చెల్లించలేక, కొత్త పనులు చేపట్టలేక ఇబ్బందులు పడుతున్నారు.పెండింగ్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం పైన ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఆసుపత్రుల ప్రతినిధులు నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నాయి.

ప్రతి నెలా రూ.500 కోట్ల చొప్పున డబ్బులు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి హామీ ఇచ్చినప్పటికీ, అనేకమంది బాధితులు ఇప్పటికీ తమ వేతనాలు, రీయింబర్స్‌మెంట్ అందుకోలేక నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు.పెండింగ్ బకాయిల పై సమర్థవంతమైన వ్యవస్థలు లేకపోవడం, విత్తన , విద్య, ఆరోగ్య రంగాల్లో సమస్యలు పెరగడం, సామాజిక, ఆర్థిక వృద్ధికి అడ్డుగా మారుతుందనే వార్తలు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి.*

తెలంగాణ ప్రభుత్వం మరో రూ.35,100 కోట్ల అప్పుకు సన్నాహాలు*

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ.1,000 కోట్లు, మూసి సుందరీకరణ పేరిట రూ.4,100 కోట్లు, యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.30,000 కోట్లు అప్పు చేయనున్న రేవంత్ రెడ్డి .దీంతో 21 నెలలో రూ.2,34,500 కోట్లకు చేరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది*

తెలంగాణ రాష్ట్రం అప్పుల వలయంలో చిక్కుకుంది. మరికొన్ని పథకాలు అమలు చేయాలంటే మరిన్ని అప్పులు చేయాల్సిందేనని రాజకీయ నిపుణలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులకు 6000 పెన్షన్ పెంపుతో…. అర్హులైన లబ్ధిదారులు 5,11,656 మంది ఉన్నారు. నెల రోజులకు గాను 6,000 × 5,11,656 = రూ .307 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడనుంది. హామీ నెరవేరాలంటే సంవత్సరానికి రూ.3,684 నిధులు అవసరం అవుతుంది.*

*ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ పథకానికి నెలకు 550 కోట్లు అవసరం*
తెలంగాణలో గ్యాస్ కనెక్షన్లు 1.1 కోట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నెలకు ఒక్కో కుటుంబానికి 1 సిలిండర్ అనుకుంటే 1.1 కోట్లు × 500 = రూ.550 కోట్లు నెలకు ఖర్చవుతుంది.
*మహాలక్ష్మి పథకానికి నెలకు రూ.8,750 కోట్ల నిధులు అవసరం*
తెలంగాణ రాష్ట్రంలో మహిళల అంచనా ప్రకారం సుమారు 35 లక్షల మహిళలు ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. నెలకు 8750 కోట్ల నిధులు అవసరం ఉంటుంది.మరిన్ని సంక్షేమ పథకాలు ప్రాజెక్టులు నిర్మించాలంటే మరో 4, లక్షల కోట్ల వరకు అప్పు చేయాల్సిందేనని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అప్పులు సమకూర్చేందుకు ప్రభుత్వ స్థలాలు వికయించడం, రిజిస్ట్రేషన్ స్టాంపులు పెంచడం, విద్యుత్ చార్జింగ్ పెంచడం, బస్ చార్జీలు పెంచడంతో ప్రజల పై మరింత భారం పడే అవకాశం ఉందని అంటున్నారు. ఏ పని ముందుకు సాగాలన్న అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం మరిన్ని రుణాలు సేకరించి నెరవేరుస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.