

టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు పుత్రసంతానం కలగడంతో మెగాఫ్యామిలీ లో ఆనందం వెల్లివిరిసింది. ఈ శుభవార్త బయటకు రాగానే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వరుణ్ లావణ్య వివాహం 2023 నవంబర్ 1న ఇటలీలో జరిగింది. ఆ తర్వాత వీరు కలిసి ప్రతి వేడుకను, ప్రత్యేక సందర్భాలను అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. పుట్టిన బిడ్డను తన చేతుల్లో ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబానికి చిన్నారి రాక ప్రత్యేక ఆనందాన్ని తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. “చిన్నారి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం” అని కూడా వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ శుభవార్తపై ఆనందం వ్యక్తం చేశారు. అభిమానులు కూడా చిన్నారికి ఆరోగ్యం, ఆనందం కలగాలని ప్రార్థిస్తున్నారు. అభిమానుల స్పందన”మెగా వారసుడు వచ్చాడు”, “చిన్నారికి మెగా బ్లడ్ ఉంది”, “కొత్త అధ్యాయం ప్రారంభమైంది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.

