ఆంధ్రప్రదేశ్ : (పున్నమి న్యూస్ ప్రతినిధి ):////
ఏపీలో సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ, ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు వంటి హామీలు అమలు చేసింది.యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక సూపర్ సిక్స్ హామీలలో మిగిలి పోయిన ఆడబిడ్డ నిధి స్కీమ్ ను దీపావళి నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇచ్చే ఈ స్కీమ్ పై ఈ నెల 10న ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


