

శ్రీకాకుళం, సెప్టెంబర్ 5:గురువు బంగారు బాటను చూపే మార్గదర్శి అని గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ కె.వి.వి. సత్యనారాయణ అన్నారు. శుక్రవారం విద్యార్థులు ఘనంగా నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. గురువుల బోధనను అక్షరాలా పాటిస్తేనే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, కళాశాల అధ్యాపక బృందాన్ని సన్మానించారు. అనంతరం విద్యార్థులు తమ గురువులను సన్మానించుకున్నారు. పోటీలలో గెలుపొందిన అధ్యాపకులకు ప్రిన్సిపాల్ బహుమతులు అందజేశారు.ఈ వేడుకలో మేజర్ వంగ మహేష్, ఐక్యూ.ఏ.సి. డా. మార్తాండ కృష్ణ, సీతారాం నాయుడు, రాజకుమార్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

