అధికారులు ఎరువుల దుకాణలపై విస్తృత తనిఖీలు
కారంపూడి , ఆగస్టు 23 (పున్నమి ప్రతినిధి)
కారంపూడిలోని ఎరువుల దుకాణాలపై కారంపూడి తహశీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్, మండల వ్యవసాయ అధికారి పోట్ల నరసింహరావు, ఎస్సై వాసు శనివారం పలు షాపులను తనిఖీలు చేశారు. రైతులకు నిల్వలు, ధరలు సరిగా ఉన్నాయా లేవా అని వారు పరిశీలించారు. షాపుల్లోని స్టాక్ రిజిస్టర్లు, ఈపాస్ బ్యాలెన్స్‌లు సరిపోల్చారు. షాపులలో లైసెన్స్‌లు ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొని షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.ఈ సందర్భంగా ఎరువుల డీలర్లకు పలు సూచనలు జారీ చేశారు. ఎంఆర్‌పి ధరలకే ఎరువులు, పురుగుల మందులు విక్రయించాలన్నారు. అధిక ధరలకు విక్రయించిన వారిపై కేసులు నమోదు చేస్తామని వారు తెలిపారు. కాబట్టి రైతులందరికి నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించాలన్నారు.


