
నరసన్నపేటలోని శర్వాణి విద్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. పాఠశాల ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మారుమ్రోగింది. విద్యార్థులు త్రివర్ణ దుస్తులు ధరించి దేశభక్తి గీతాలను ఆలపించగా, చిన్నారులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీమతి సాయిరాణి గారు పాల్గొని మాట్లాడుతూ – “స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యత. విద్యార్థులు దేశభక్తిని ఆచరణలో పెంపొందించుకొని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలి” అని ప్రేరణనిచ్చారు.తల్లిదండ్రులు, గ్రామస్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణం త్రివర్ణ పతాకాలతో, దేశభక్తి నినాదాలతో సందడి చేసింది.

