స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే *స్త్రీ శక్తి పథకం* ప్రారంభం కానున్న సందర్భంగా నంద్యాల డిపోను సందర్శించిన ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు
నంద్యాల డిపో పర్యటనకు విచ్చేసిన *పూల నాగరాజు* కి రీజినల్ మేనేజర్ రజియా సుల్తానా ఇన్చార్జి డిపో మేనేజర్ వినయ్ కుమార్ ఘన స్వాగతం పలికి సత్కరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ డిపో బస్ స్టేషన్ ఆవరణలోని ప్రయాణ ప్రాంగణమును పరిశీలించి, ఉచిత బస్సు సౌకర్యం పై మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది. మహిళలకు భద్రతా పరిరక్షణతో పాటు వినూత్న సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ప్రయాణికులకు తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయవలెనని అధికారులకు సూచించారు. డిపో గ్యారేజ్ ను సందర్శించి బస్సుల మెయింటెనెన్స్, సమయపాలన గురించి సిబ్బందితో మాట్లాడటం జరిగింది. అనంతరం నంద్యాల డిస్పెన్సరీ ని సందర్శించి అక్కడ ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి, అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ రజియా సుల్తానా డిపో మేనేజర్ వినయ్ కుమార్ బస్ స్టేషన్ సూపర్వైజర్లు మరియు ఇతర ఉద్యోగులు పాల్గొనడం జరిగినది.


