నెల్లూరు: డిప్యూటీ MRO ప్రియాంకకు నోటిసులు
DRO లాగిన్లో ఉన్న ఫైల్ను ఉన్నతాధికారుల అనుమతి లేకుండా తన లాగిన్లోకి తీసుకున్న డిప్యూ టీ MRO ప్రియాంకకు DRO హుస్సేన్ సాహెబ్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. తన అనుమతి లేకుండా ఫైల్ను ఎందుకు తీసుకున్నారో వివరణ ఇవ్వాలంటూ ఆమెను కోరారు. వివరణ అనంతరం ఆమెపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కలెక్టరేట్ ఉన్నతాధికారులు తెలిపారు. గతంలో కూడా ఆమెపై పలు ఆరోపణలు ఉన్నాయి.


