….హత్తిరాల కమ్మపల్లిలో శ్రీ సీతా లక్ష్మణ హనుమంత సమేత రామచంద్రస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ముఖ్య అతిథిగా బత్యాల.
06-08-2025వ తేదీ బుధవారం నాడు రాజంపేట మండలం హత్తిరాల కమ్మపల్లిలో శ్రీ సీతా లక్ష్మణ హనుమంత సమేత రామచంద్రస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా విచ్చేసి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు.ఈ సందర్భంగా వేద పండితులు బత్యాల చంగల్ రాయుడు ను శాలువ కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.అనంతరం అక్కడ నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు……., ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.


