ZPHS ఏడునూతులలో చదువుకున్న విద్యార్థి శ్రీజర్ రెడ్డి, 2025 సంవత్సరం SSC ఫలితాల్లో 566 మార్కులు సాధించి తన ప్రతిభను చాటాడు. తన అద్భుతమైన కృషితో IIIT బాసరలో సీటు సాధించి, పాఠశాల పేరు మరింత మెరిపించాడు.
ఈ సందర్భాన్ని గుర్తుగా చేసుకుంటూ, ప్రాథమిక పాఠశాల, ఏడునూతుల LFL HM అయిన శ్రీ బుక్క ప్రవీణ్ కుమార్ గారు శ్రీజర్ విజయాన్ని అభినందిస్తూ రూ.5,000 నగదు బహుమతిని ప్రకటించి అందజేశారు. శ్రీజర్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరుకాలేకపోయినా, అతని తండ్రి శ్రీ సంజీవ రెడ్డి గారు బహుమతిని స్వీకరించారు.
ఈ సందర్భంగా బుక్క ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ,
> “ఇది మా గ్రామ పాఠశాల విద్యార్థుల కృషికి నిదర్శనం. రాబోయే సంవత్సరాల్లో ఎవరు IIIT బాసరలో సీటు సాధించినా, నేను ఇలాగే నగదు బహుమతిని అందజేస్తాను” అన్నారు.
ఈ మాటలు విద్యార్థుల్లో విశ్వాసం, తల్లిదండ్రుల్లో ఆనందాన్ని నింపాయి.
ఈ కార్యక్రమంలో ZPHS ఎడునూతుల ప్రధానోపాధ్యాయులు శ్రీ నారబోయిన యాకయ్య గారు పాల్గొని అభినందనలు తెలిపి, సంజీవరెడ్డి & ప్రవీణ్ కుమార్ గార్లను సన్మానించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ఈ ఘట్టాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కమల్ కుమార్, రాంబాబు, భాస్కర్, ఈర్య, యాదగిరి, G. రజిత, మమత, M. రజిత మొ., వారు పాల్గొన్నారు.
ఈ విజయగాథ గ్రామల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.


