కొత్తపేట,జులై01,పున్నమి న్యూస్, ప్రతినిధి కిరణ్ :
సంక్షేమం,అభివృద్ధి రెండింటిలోనూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు.డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం మరియు మందపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.పెన్షన్స్ పంపిణి చేసిన ఎమ్మెల్యే సత్యానందరావుప్రజలకు సంక్షేమ ఫలాలు సకాలంలో అందించడంలో భాగంగా ప్రతీ నెలా ఒకటో తేదీనే పెన్షన్లు అందిస్తున్నామన్నారు.ఒక పక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మరొక పక్క సంక్షేమం అందించడంలోనూ కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో మొత్తం 41,908 పెన్షన్స్ గాను రూ.18.19 కోట్ల పంపిణి జరుగుతుందని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.