పున్నమి తెలుగు దిన పత్రిక ✍️
దివంగత ముఖ్యమంత్రి మహానేత డా.వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు నిత్యం స్మరించుకుంటూ ఉంటారని లెబాకు నారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ లెబాకు విజయకృష్ణా రెడ్డి చెప్పారు.సున్నిత మనస్కులైన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లో మానవీయత ఉట్టి పడేదని,బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేవారని అన్నారు.ముఖ్యమంత్రిగా ఆయన చూపిన మానవీయత వెలకట్టలేనిది కొనమానానికి అందనిదని కొనియాడారు. వైఎస్ జయంతి సందర్భంగా లెబాకు నారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరులోని ప్రభుత్వ బాలసదన్ విద్యార్థులకు పలహారాలు పండ్లు పంపిణీ చేశారు. బాలబాలికలంటే వైఎస్ కు ఏనలేని అభిమానమని అందరూ మంచిగా చదువుకోవాలని,ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రగాఢంగా కోరుకునే వారని అన్నారు.రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు గురించి ప్రస్తావించాలంటే కొన్ని గంటలు చెప్పాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు