కార్పొరేటర్ హమీద్ పటేల్ కి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ…
పున్నమి న్యూస్ ప్రతినిది శేరిలింగంపల్లి, శేరిలింగంపల్లి జూన్ 23:
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇతర పార్టీల నేతల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉదయం నుండి రాత్రి వరకూ సందర్శకుల తాకిడితో ఆయన నివాసం కోలాహలంగా మారిపోయింది. వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు హమీద్ పటేల్ కి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. పాత్రికేయులు, ప్రజా సంఘాల నేతలు, పుర ప్రముఖులు హమీద్ పటేల్ నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి అని ఆకాంక్షించారు. ఆయనకు శాలువా తో, పూల మాలలు, పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో రవిసాగర్, జర్నలిస్ట్ లు విజయ్ కుమార్, మారుతీ చౌదరి, శివ, బండి రామకృష్ణ గౌడ్ లు పాల్గొని హమీద్ పటేల్ కి శాలువా లతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.