————————————–
10 ఆంధ్ర నేవెల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు లెఫ్ట్నెంట్ కమాండర్ గణేష్ గొదంగవే గారి ఆధ్వర్యంలో తొమ్మిదవ ఎన్ సి సి నేవల్ వార్షిక శిక్షణా శిబిరం కోట మండలం విద్యానగర్ లోని నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జూన్ 20వ తేదీ నుంచి 29 జూన్ 2025 వరకు నిర్వహించబడుతున్న విషయం విధితమే.
ఈ శిక్షణా శిబిరానికి గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం జిల్లాలకు సంబంధించి వివిధ కళాశాలలు, ఉన్నత పాఠశాలల ఎన్సిసి నేవల్ జూనియర్ డివిజన్ జూనియర్ వింగ్ సీనియర్ డివిజన్ సీనియర్ వింగ్ క్యాడెట్లు 600 మంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా
క్యాంప్ కమాండెంట్,
లెఫ్ట్నెంట్ కమాండర్ గణేష్ గొదంగవే ఈ శిక్షణా శిభిరం గురించి మాట్లాడుతూ
కేడేట్లను దేశ ఉత్తమ పౌరులుగా భావి భారత వీర సైనికులుగా తీర్చిదిద్దే క్రమంలో వారిలో ఐక్యత, క్రమశిక్షణ,దేశభక్తి, సేవా భావం, సామాజిక సేవా దృక్పథం, పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ, ఫైరింగ్, ఆయుధ శిక్షణ తదితర అంశాలపై చక్కటి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని క్యాంప్ కమాండెంట్ గణేష్ గొదంగవే అన్నారు.
ఉదయం శారీరక దారుడ్యం, యోగాసనాలు, ఫైరింగ్ శిక్షణ,పేరెడ్ ట్రైనింగ్, డ్రిల్, వ్యక్తిత్వ వికాస అభివృద్ధి, సామాజిక అవగాహన, రిగ్గింగ్, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలు, ఆరోగ్యము పరిశుభ్రత, షిప్ మోడలింగ్, ఎన్సిసి జనరల్, సీమ్యాన్షిప్ తదితర అంశాలపై అసోసియేట్ ఎన్ సి సి అధికారులు, పి ఐ స్టాఫ్ శిక్షణ ఇచ్చారు.
సీనియర్ డివిజన్ సీనియర్ వింగ్ క్యాడెట్లకు త్వరలో జరగబోవు ఇంటర్ గ్రూప్ కాంపిటేషన్ (ఐజిసి), నవ సైనిక్ క్యాంపులకు ఎంపికయ్యే విధంగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
కొంతమంది క్యాడెట్ లను కృష్ణపట్నం పోర్టుకు క్షేత్ర పర్యటన నిమిత్తం సందర్శింపజేసి షిప్పులను ప్రత్యక్షంగా చూపించి వాటి గురించి క్యాడెట్లకు అవగాహన కల్పించడం జరిగింది. క్యాడెట్లు నౌకలను సందర్శించి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా తిలకించి పులకించారు.
ఎన్సిసి జనరల్, సోషల్ అవేర్నెస్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అంశాలపై ఉపన్యాసం ముఖ్య అతిథులచే ఇప్పించడం జరిగింది. అనంతరం క్యాడేట్లకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. క్యాడెట్లు అత్యంత ఆనందోత్సాహాలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.