హైదరాబాద్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్‌లో అపోహలు
హైదరాబాద్ మే (పున్నమి ప్రతినిధి)
హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ప్రజల్లో అనేక అపోహలు నెలకొన్నాయి. ధరలు ఎప్పుడూ పెరుగుతాయని, ORR పక్కన ఉన్న ప్రతీ స్థలం లాభదాయకమని, వ్యవసాయ భూములు తక్కువ ధరకే అధిక లాభం ఇస్తాయని భావించడం విస్తరించిపోయింది. అలాగే, RERA ఉన్నదంటే పూర్తిగా భద్రంగా ఉందని, IT కారిడార్ వద్ద ఎప్పటికీ లాభాలే అని నమ్ముతున్నారు. కానీ అనుభవజ్ఞులైన రియల్ ఎస్టేట్ నిపుణులు సూచించేది – ఏ పెట్టుబడికైనా ముందు పూర్తి పరిశోధన చేయాలి. వాస్తవ పరిస్థితులు, లీగల్ క్లారిటీ, మౌలిక సదుపాయాలపై విశ్లేషణ అవసరం అని రాజు 92465 30369 తెలిపారు

