ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 04 : భారతదేశంలో మొదటి శివాలయంగా గుర్తింపు పొందిన గుడిమల్లం శ్రీ పరుశురామేశ్వర స్వామి దేవాలయంలో ఏప్రిల్ 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు వైభవంగా మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో చిన్న మరమ్మతు పనులు చేయడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గుడిమల్లం లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. చారిత్రాత్మక పుణ్యక్షేత్రం, శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 8 తేదీన స్వామివారు బాలాలయంలోకి వెళ్ళనున్నారు. బాలాలయం కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామనీ బుధవారం నాడు గుడిమల్లంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆలయ పాలకమండలి చైర్మన్ బత్తల గిరినాయుడు, ఈఓ కె. రామచంద్రారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు వంశీకృష్ణ శర్మ, పాలకమండలి సభ్యులు వివరాలు వెల్లడించారు. కేంద్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో, ఆగమ శాస్త్రం ప్రకారం ఈ బాలాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రస్తుతం ఆలయంలోని రాజగోపురంతో పాటు ఇతర కీలక ప్రాంతాలలో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని శాస్త్రం ప్రకారం గర్భాలయంలో పనులు జరుగుతున్నప్పుడు, మూలవిరాట్ శక్తులను తాత్కాలికంగా అత్తి చెక్కతో చేసిన ప్రతిమలోకి (నమూనా) ఆవాహన చేసి, ప్రత్యేకంగా నిర్మించిన బాలాలయంలో ప్రతిష్ఠిస్తారు. పనులు పూర్తయ్యే వరకు స్వామివారికి నిత్య పూజలు అక్కడే జరుగుతాయని చైర్మన్ గిరి నాయుడు తెలిపారు. అనంతరమ ఆలయ వేదం పండితులు వంశీకృష్ణ శర్మ మాట్లాడుతూ…. ఆలయ మరమ్మతు పనులు పూర్తయిన తర్వాత ఏప్రిల్ 19 నుంచి 23వ తేదీ వరకు మహా కుంభాభిషేకం 40 మంది రిత్వికులచే చెప్పటనన్నట్లు తెలిపారు. ఏప్రిల్ 19వ తేదీ పరశురామేశ్వర స్వామి జయంతి సందర్భంగా మహా కుంభాభిషేకం ప్రారంభమై 23వ తేదీ వరకు జరుగుతుందన్నారు. 42 రోజులు దర్శనం బాలాలయంలోనే జరుగుతాయని ప్రధాన అర్చకులు తెలిపారు.

8న బాలాలయంలోకి గుడిమల్లం పరశురామేశ్వర స్వామి