Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Visakhapatnam

88 వార్డ్, నరవ గ్రామం లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం.

Punnami Newsroom Published:
88 వార్డ్, నరవ గ్రామం లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం.

ముఖ్య అతిథిగా పాల్గొన్న 88 వార్డ్ అధ్యక్షులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్

నరవ జనసేన పార్టీ లోగోను ఆవిష్కరించిన వీర మహిళలు.

గ్రామ నాయకత్వం బలపడేలాగా కార్యచరణకు సిద్ధపడాలని , అందులో భాగంగా జనసైనికుడు లింగం శ్రీనివాసరావు గారికి బాధ్యతలు.

88 వార్డ్, జనసేన పార్టీ అధ్యక్షులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నరవ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, జనసేన పార్టీ సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతూ దూర దృష్టితో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏడు సిద్ధాంతాలు తో మన పార్టీని పెట్టడం జరిగిందని, రాష్ట్రం ప్రయోజనాల కోసం కూటమిని ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కళ్యాణ్ గారు, కీలక పాత్ర వహించారని, స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామంలో నాయకత్వం బలపడేలాగా పార్టీకి అహర్నిశలు కష్టపడుతున్న లింగం శ్రీనివాసరావు గారికి బాధ్యతలను అప్పజెప్పడం జరిగిందని, ఆయన ఆధ్వర్యంలో మరింత జనసేన పార్టీ బలపడేలాగా మనమందరం ఆయనకు సహకరించాలని, ఈ యొక్క వార్డు జనసేన పార్టీకి చాలా బలమైందని, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే తన నియోజవర్గమైన పిఠాపురాన్ని రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన యొక్క వార్డును నేను అభివృద్ధి చేస్తానని, ఎటువంటి సమస్య ఉన్న మా దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్య పరిష్కారం చేయడానికి వంద శాతం కృషి చేస్తామని, ఈరోజు NDA కూటమి వలన రాష్ట్రానికి ఎన్ని ప్రయోజనాలు వచ్చాయి అదే విధంగా మన ఈ యొక్క నరవ గ్రామానికి కూడా కళ్యాణ మండపంలో అందుబాటులో తీసుకొని రావడం, ప్రధాన రహదారి వర్షాకాలంలో నీరు నిలువ లేకుండా చర్చి వద్ద రోడ్లు వేయడం, గ్రామానికి ఒక పది పడకల హాస్పిటల్ భవిష్యత్తులో నిర్మించడం, బిసి గురుకుల పాఠశాలకు శాశ్వత బిల్డింగ్ ఏర్పాటు చేయడం, ఇలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు మన నరవ గ్రామంలో చేయడం జరిగిందని, తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు మాకు మన జనసేన పార్టీకి ఉండాలని కోరడం జరిగింది.
అనంతరం నరవ జనసేన పార్టీ లోగోను వీర మహిళతో ఆవిష్కరించడం జరిగింది, స్థానిక బాధ్యతను తీసుకున్న లింగం శ్రీనివాసరావు గారిని సాల్వాతో సత్కరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నరవ సైనిక్ ఉద్యోగుల సంక్షేమ కార్యవర్గ సభ్యులు, వీర మహిళలు ప్రియ, మీనాక్షి, తులసి, కుమారి, భారతి, మారుతి, జనసేన పార్టీ సభ్యులు నవీన్ ,అశోక్ కుమార్, ప్రవీణ్, శ్రీను, అప్పలరాజు, ఓమ్మి అప్పలరాజు, చిరంజీవి, బ్రహ్మాజీ, రవి, శంకరరావు మరియు 200 మంది జనసేన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

88 వార్డ్, నరవ గ్రామం లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *