Friday, 27 March 2026
  • Home  
  • 87వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన 18.80 లక్షల జీఎంసీ నిధులతో కొత్త వాటర్ పైప్‌లైన్ల ఏర్పాటు
- విశాఖపట్నం

87వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన 18.80 లక్షల జీఎంసీ నిధులతో కొత్త వాటర్ పైప్‌లైన్ల ఏర్పాటు

గాజువాక డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గం పరిధిలోని 87వ వార్డు తిరుమలనగర్‌లో తాగునీటి సమస్యల పరిష్కారానికి కీలక అడుగు పడింది. తిరుమలనగర్‌లో కొత్తగా వాటర్ పైప్‌లైన్లు వేయుటకు నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి, స్థానిక వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం (జగన్) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలనగర్‌లో పాత వాటర్ పైప్‌లైన్ల లీకేజీల కారణంగా జీవీఎంసీ నీరు వృథాగా పోవడంతో పాటు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని రోడ్ క్రాసింగ్ ప్రాంతాల్లో కొత్తగా ఎమ్‌ఎస్ పైప్‌లైన్లు ఏర్పాటు చేయడానికి జీవీఎంసీ నిధుల నుంచి 18 లక్షల 80 వేల రూపాయలు మంజూరు చేయించి, పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే తాగునీటి సరఫరాలో మెరుగుదలతో పాటు నీటి వృథా కూడా తగ్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు, సెక్రటరీ బొట్టా ప్రకాష్, బెల్లంకొండ రాజన్ రాజు, ఆనంద్ కుమార్, కణితి ఈశ్వరరావు, మల్లా రాము, కడుపుట్ల శ్రీను, జాన్ రమేష్, భాగ్యలక్ష్మి, దాలయ్య, ఏటియన్ మూర్తి, కళ్యాణ్ చెక్రవర్తి, విశ్వేశ్వరరావు, పరమానందం, సన్యాసిరావు, తిరుమలనగర్ అసోసియేషన్ సభ్యులు, జీవీఎంసీ వాటర్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గాజువాక డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)

గాజువాక నియోజకవర్గం పరిధిలోని 87వ వార్డు తిరుమలనగర్‌లో తాగునీటి సమస్యల పరిష్కారానికి కీలక అడుగు పడింది. తిరుమలనగర్‌లో కొత్తగా వాటర్ పైప్‌లైన్లు వేయుటకు నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి, స్థానిక వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం (జగన్) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలనగర్‌లో పాత వాటర్ పైప్‌లైన్ల లీకేజీల కారణంగా జీవీఎంసీ నీరు వృథాగా పోవడంతో పాటు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని రోడ్ క్రాసింగ్ ప్రాంతాల్లో కొత్తగా ఎమ్‌ఎస్ పైప్‌లైన్లు ఏర్పాటు చేయడానికి జీవీఎంసీ నిధుల నుంచి 18 లక్షల 80 వేల రూపాయలు మంజూరు చేయించి, పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే తాగునీటి సరఫరాలో మెరుగుదలతో పాటు నీటి వృథా కూడా తగ్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు, సెక్రటరీ బొట్టా ప్రకాష్, బెల్లంకొండ రాజన్ రాజు, ఆనంద్ కుమార్, కణితి ఈశ్వరరావు, మల్లా రాము, కడుపుట్ల శ్రీను, జాన్ రమేష్, భాగ్యలక్ష్మి, దాలయ్య, ఏటియన్ మూర్తి, కళ్యాణ్ చెక్రవర్తి, విశ్వేశ్వరరావు, పరమానందం, సన్యాసిరావు, తిరుమలనగర్ అసోసియేషన్ సభ్యులు, జీవీఎంసీ వాటర్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.