గాజువాక జనవరి (పున్నమి ప్రతినిధి)
87వ వార్డు పరిధిలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక కార్పొరేటర్ బోండా జగన్నాథం (జగన్) హాజరయ్యారు. ముందుగా కేక్ కట్ చేసి, అనంతరం వడ్లపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, రొట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోండా జగన్నాథం, యువతకు ఆదర్శంగా నిలిచే నాయకుడు నారా లోకేష్ అని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ బొట్టా ప్రకాష్, రాజన్ రాజు, ప్రగడ దానయ్య, పావాడా వెంకటరమణమూర్తి, ద్రోణద్రి అప్పలనాయుడు, కణితి ఈశ్వరరావు, ఆనంద్ కుమార్, పెంటయ్య, కడుపుట్ల శ్రీను, వై.భాస్కరరావు, బొడ్డా సన్యాసి, భాగ్యలక్ష్మి, కోరుకొండ కళ్యాణ్ చక్రవర్తి, దాలయ్య, సుందర్, సునీల్, కనకసత్యం, పొతల కృష్ణ, ఆదినారాయణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.






