విశాఖపట్నం: ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి)
కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గం 86వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయి.టిడిపి రాష్ట్ర అధ్యక్షులు,ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దువ్వాడ ఫ్లైఓవర్ బ్రిడ్జి క్రింద రూ.4 కోట్ల వ్యయంతో 60కి పైగా కంటైనర్ ఆధారిత ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి,సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ప్రజలకు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.స్థానిక నాయకులు ఎమ్మెల్యేను అభినందిస్తూ కూటమి సమన్వయంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.ఈ సందర్భంగా కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్ వరకు రెండు వైపులా రోడ్డు పూర్తి చేయాలని,ఫ్లైఓవర్ జాయింట్ రబ్బర్ సమస్యతో గర్భిణీ మహిళలు ఇబ్బందులు పడుతున్నారని,ఫకీర్తకియ 100 అడుగుల కనెక్టివిటీ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో ప్రసాదుల శ్రీను,లేళ్ల కోటేశ్వరరావు,నల్లూరు సూర్యనారాయణ,వేగుంట శ్రీను,చదరం తులసిరామ్,గణపతి,లోవబాబు,తలారి వెంకటరమణ,బొడ్డపల్లి అప్పారావు,మోటూరు బాబురావు,అశోక్,గంధం వెంకటరావు,కాదా శ్రీను,జివిఎంసి అధికారులు మరియు భారీ సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Uploaded Video:



