రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
రైల్వేకోడూరు నియోజకవర్గంలో టీడీపీ బలం పుంజుకుంది. పాటూరు శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలో 3 ఎంపీటీసీలు, 2 సర్పంచులు, గ్రామ నాయకులతో సహా 650 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కేఎస్ అగ్రహారం, తుమ్మకొండ, కందులవారి పల్లి, చిట్వేల్ గ్రామాల్లో జరిగిన ఈ చేరికలకు టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి నాయకత్వం వహించారు. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతోనే ఈ చేరికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.


