నందలూరు -నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ అరవపల్లి గ్రంథాలయంలో శుక్రవారం 58వ గ్రంథాలయ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగిరెడ్డిపల్లె సర్పంచ్ జంబు సూర్యనారాయణ, మండల విద్యాశాఖ అధికారి అనంతకృష్ణ, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగనపల్లి వెంకటరమణ, జ్ఞాన దీప్తి ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మి, గ్రంథాలయ అధికారి శివశంకర్ రాజు, ఉపాధ్యాయుడు జి.కృపానందం తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ చిన్నతనం నుండే పుస్తక పఠనం అలవాటు చేసుకుంటే విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని, పుస్తకం ఒక మంచి స్నేహితుడని, పుస్తక పఠనం ద్వారా మంచి ఆలోచనలు, ఆరోగ్యం, భవిష్యత్తులో మంచి పౌరుడిగా ఎదగడానికి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు జ్ఞాన నేత్రాన్ని ఇస్తారని, విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హైస్కూల్, జ్ఞాన దీప్తి హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం గ్రంథాలయాధికారి రవిశంకర్ రాజు, రవికుమార్ మాచుపల్లి విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

58వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగింపు