


నరసన్నపేట, శ్రీకాకుళం: స్థానిక మారుతీ నగర్ జంక్షన్‌లో ప్లాటినం 22 గుడ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈరోజు 500 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ హితంగా మట్టి విగ్రహాలను వినియోగించాలని అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విగ్రహాలను స్వీకరించారు.
ఈ సందర్భంలో ప్లాటినం 22 గుడ్ ఫ్రెండ్స్ సభ్యులు తమ సామాజిక సేవా కార్యక్రమాల కోసం గుర్తింపు పొందారు. వీరికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా కెరీర్ ఫెయిర్ అవార్డు అందజేయబడింది.
నిర్వాహకులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

