విశాఖపట్నం జిల్లా, భీమిలి (పున్నమి ప్రతినిధి): అక్టోబర్ 18:: జీవీఎంసీ 5వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గరికిన ఎల్లయ్య (కింగ్) సతీమణి గరికిన సుధా భీమిలి జోనల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కలిసి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా సుధా మాట్లాడుతూ, తనకు 5వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, వార్డు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చి మద్దతు తెలిపిన వార్డు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో అందరూ ఐక్యంగా పనిచేసి విజయోత్సవంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
గరికిన సుధా నామినేషన్‌తో 5వ వార్డులో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఆమెకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
